– ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి సూచన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ విద్యా విధానం ఉన్నతిని పెంచేలా ప్రపంచం గుర్తించేలా విజన్ డాక్యుమెంట్ ఉండాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రపంచవ్యాప్తంగా విద్యా రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోందనీ, ఈ దిశగా తెలంగాణ విద్యావిధానంలో మార్పులు తేవాల్సిన అవసరముందని సూచించారు. ఉపాధి అవకాశాల్లో వెనుకబాటుకు నైపుణ్యం కొరతే కారణమనీ, ప్రపంచ విద్యా సంస్థలను రాష్ట్ర విద్యా వ్యవస్థకు చేరువ చేయాల్సిన అవసరం ఉందని కోరారు. రాష్ట్రంలో అపారమైన మానవ వనరులున్నాయనీ, విస్తృతమైన మౌలిక సదుపాయాలకు కేంద్రమన్న వాస్తవాన్ని ఇతర దేశాలు గుర్తించేందుకు గ్లోబల్ సమ్మిట్‌ను వేదికగా చేసుకోవాలని సూచించారు. ఈ వాస్తవాన్ని ప్రపంచ దేశాలు గుర్తిస్తే విద్యా రంగంలో పెట్టుబడులు పెరుగుతాయనీ, ఫలితంగా నాణ్యమైన విద్య తెలంగాణ అందిపుచ్చుకునే వీలుందని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్‌లో విద్యా విధానం భవిష్యత్ ఎలా ఉండాలనే అంశంపై అనుభవజ్ఞులైన విద్యావేత్తలు, ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు ప్రభుత్వం తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు.
ప్రపంచం గుర్తించేలా విద్యావిజన్ ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



