జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) విజయలక్ష్మి
నవతెలంగాణ – కాటారం
మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) విజయలక్ష్మి సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల హాజరు, పాఠ్యాంశాలపై అవగాహన, సౌకర్యాలు, మధ్యాహ్న భోజన నిర్వహణను అదనపు కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ 10 వ తరగతి విద్యార్థులతో మమేకమై ఎలా ఉన్నారు. బాగా చదువుతున్నారా.. ఉదయం ఏమి తిన్నారు, ఆహారం బావుంటుందా, సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఆటలు ఆడుతున్నారా అంటూ ఆరా తీశారు.
పాఠశాలలో విద్యార్థుల విద్య, భోజన, పాఠశాల వాతావరణం, బోధన విధానాలను ఆమె సమీక్షించారు. విద్యార్థుల సౌకర్యాలను మరింత మెరుగుపరిచే దిశగా మద్యలో ఆగిపోయిన బిల్డింగ్ నిర్మాణం, పూర్తి చేయుటకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అదనపు కలెక్టర్ ఆకాంక్షించారు. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిద్దేందుకు ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని సూచించారు.
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని, క్రీడల్లోనూ చురుకుగా పాల్గొని ప్రతిభను పెంపొందించుకోవాలని ఆయన ప్రోత్సహించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో నాణ్యమైన విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ఆదేశించారు. ఈ సందర్భంగా కిచెన్, వంట సామాన్లు భద్రపరచు గదులను పరిశీలించారు. వంట సామాన్లు భద్రపరచుకు ఇనుప కేజ్ ఏర్పాటు చేయడం బావుందని అభినందించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ అడ్డూరి బాబు,పంచాయతీ కార్యదర్శి శగీర్ ఖాన్,ప్రన్సిపాల్ నాగలక్ష్మి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.