Saturday, July 5, 2025
E-PAPER
Homeజాతీయంబీజేపీ, డీఎంకేతో పొత్తు ఉండదు

బీజేపీ, డీఎంకేతో పొత్తు ఉండదు

- Advertisement -

టీవీకే అధినేత విజరు
-సెప్టెంబరు నుంచి రాష్ట్ర పర్యటన
చెన్నై :
బీజేపీ, డీఎంకేలతో తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఎప్పటీకి పొత్తు పెట్టుకోదని ఆ పార్టీ అధ్యక్షులు, సినీ నటులు విజరు శుక్రవారం స్పష్టం చేశారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మూడో కూటమి ఉంటే దానికి టీవీకే నాయకత్వం వహిస్తుందని విజరు తెలిపారు. శుక్రవారం చెన్నై శివార్లలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో టివికె కార్యనిర్వాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2026 ఎన్నికలకు పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజరును ప్రకటించారు. పొత్తు, ఇతర విషయా లపై నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని విజరుకు అప్పగిం చారు. అలాగే సెప్టెంబర్‌ నుంచి రాష్ట్రంలో విజరు పర్య టించనున్నారు. పార్టీ రెండో రాష్ట్ర సమావేశాన్ని ఆగస్టులో నిర్వహించడాన్ని పరిశీలించారు. ఈ సమావేశంలో విజరు మాట్లాడుతూ
కేంద్రంలోని అధికార బీజేపీ తన రాజకీయ ప్రయోజ నాల కోసం ప్రజల మతపరమైన భావాలను ఉపయోగిం చుకుంటోందని, సమాజంలో విభజనలు సృష్టించడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. ‘ఇటు వంటి విషపూరిత వ్యూహాలు మరెక్కడైనా పనిచేసినా… తమిళనాడులో మాత్రం ఎప్పటికీ విజయం సాధించవు’ అని విజరు తెలి పారు. ‘సామాజిక న్యాయం, మత సామరస్యం, సోదర భావం సమానత్వం తమిళనాడు గడ్డపై లోతుగా పాతుకుపోయాయి. పెరియార్‌ (ఈవీ రామసామి), అరిజ్ఞార్‌ అన్నా (సీఎన్‌ అన్నాదురై).. లేదా తమిళనాడు ప్రజలు గౌరవించే ఇతర నాయకులను అవమానించే ఏ రాజకీయ పార్టీ కూడా ఇక్కడ విజయం సాధించదు. ఇటువంటి నాయకులను అగౌరవపరిస్తే బీజేపీ ఎప్పటికీ విజయం సాధించదు’ అని విజరు అన్నారు.
కాగా, శుక్రవారం సమావేశంలో మెల్మాలో సిప్‌కాట్‌ ప్రాజెక్టు విస్తరణను, బీహార్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్‌ సవరణను వ్యతిరేకించడం, చెరకు రైతులకు బకాయిలు చెల్లించాలని, ధరలు క్షీణించడంతో ప్రభావిత మైన మామిడి రైతులకు పరిహారం చెల్లించాలని, ఇసుక, ఖనిజాల అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలనే వంటి డిమాండ్లతో 20 తీర్మానాలను కార్యనిర్వాహక కమిటీ ఆమోదించింది. అలాగే, రెండు భాషల విధానానికి తమ మద్దతును పార్టీ పునరుద్ఘాటించింది. కిలాడీలో తమిళ నాగరికతకు సంబంధించిన ఆధారాలను కేంద్రం తారుమారు చేస్తోందని విమర్శించింది. ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ ప్రతిపాదన, డిలిమిటేషన్‌ ప్రక్రియలను టీవీకే ఖండించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -