– అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
– బల్మూరులో ఎన్నికల ప్రచారం
నవతెలంగాణ – బల్మూరు
మండల కేంద్రంలోని కొందరు రైతులను మోసం చేసినోళ్లే ఒక్కటయి కూటమి అంటూ మళ్లీ ఓట్లు అడగ వస్తున్నారని అటువంటి వాళ్లను ప్రజలు నమ్మరని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం అర్ధరాత్రి స్థానిక గాంధీ చౌరస్తా వద్ద జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఊరుకు ఊరే పోతుందని రైతులందరి పొలాలు పోతున్నాయని ఇప్పుడు ఎన్నికల సమయంలో చెప్పుకుంటున్నారు. కానీ అది వాస్తవం కాదని అన్నారు. గతంలో రిజర్వాయర్ మీరు కాదా ఇక్కడికి తెచ్చింది అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలను గందరగోల పరుస్తున్నారని ప్రజలు ఇది గమనిస్తున్నారని అన్నారు.
అచ్చంపేటనియోజకవర్గంలోని ప్రతి మండలంలో గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో చేపడతానని హామీ ఇచ్చారు. అధికార కాంగ్రెస్ పార్టీ బల్మూరులో బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వలిగే తిరుపతమ్మ వెంకటయ్యను సర్పంచిగా గెలిపించుకోవాలని అన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు త్వరలో చేపడతామని ఎవరు ఎన్ని చెప్పినా గ్రామ అభివృద్ధి మాత్రం జరుగుతుందని అన్నారు. మాజీ ఎంపీటీసీ ఖదీర్ మాట్లాడుతూ గతంలో ఉన్నవారు గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని అన్నారు. మరోసారి వారికి ఓట్లు వేసి గెలిపించినట్లయితే గ్రామపంచాయతీని కాజేస్తారని అన్నారు. అందుకే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుందామని అన్నారు. ఊరేగింపు అనంతరం బహిరంగ సభ లో సర్పంచ్ అభ్యర్థి వలిగే తిరుపతమ్మ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వెంకటరెడ్డి వెంకటయ్య స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.



