భారత్‌పై విరుచుకుపడిన ట్రంప్
న్యూఢిల్లీ : భారత్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి టారిఫ్‌లపై విరుచుకుపడ్డారు. ప్రపంచం లోనే అత్యధికంగా సుంకాలు విధించే దేశం భారత్ అంటూ ముద్ర వేశారు. చైనా, బ్రెజిల్ మాదిరిగా భారత్, టారిఫ్‌లతో అమెరికాను చంపేస్తోందని వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా టారిఫ్‌లను ఎత్తివేసేందుకు భారత్ ముందుకొచ్చిందన్న తన వాదనను మరోసారి పునరావృతం చేశారు. తాను కఠినంగా వ్యవహరించకపోతే ఇది జరిగి వుండేది కాదని చెప్పుకున్నారు. స్కాట్ జెన్నింగ్స్ రేడియో షోలో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా, బ్రెజిల్, భారత్‌లు సుంకాలతో మనల్ని చంపేస్తున్నారు. వారికన్నా కూడా మెరుగ్గా నాకు ఈ టారిఫ్‌ల గురించి అవగాహన వుంది. ప్రపంచంలో మరెవరైనా అర్ధం చేసుకునేదాని కన్నా ఎక్కువగా టారిఫ్‌ల గురించి నేను అర్ధం చేసుకున్నానని నాకనిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా సుంకాలు విధించే దేశం భారతదేశమే, కానీ వారు ఇకపై మాకు భారత్‌లో ఎలాంటి సుంకాలు విధించబోమని హామీ ఇచ్చారు. నో టారిఫ్‌లు.” అని పేర్కొన్నారు. ”నేను సుంకాలు విధించకపోతే వారెన్నటికీ ఈ ఆఫర్ ఇవ్వరు, కాబట్టి మీకు టారిఫ్‌లు వుండాల్సిందే.” అంటూ ట్రంప్ విపరీత వ్యాఖ్యలు చేశారు. ఈ టారిఫ్‌ల వల్లనే అమెరికాకు మాట్లాడే శక్తి అపారంగా వచ్చిందని చెప్పుకున్నారు. ట్రంప్ తన ఆర్థిక, విదేశాంగ విధానంలో టారిఫ్‌లను ఒక ఎరగా, ఎత్తుగడగా ఉపయోగించుకుంటూ వస్తున్నారు. భారత్‌తో వాణిజ్యమనేది ”పూర్తిగా ఏకపక్ష విపత్తు”గా నిలిచిందని ఆయన సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. ”వారి అతిపెద్ద క్లయింట్ కాబట్టి భారత్ మాకు పెద్దమొత్తంలో ఉత్పత్తులు విక్రయిస్తుంది. కానీ మేం వారికి చాలా తక్కువగానే అమ్ముతాం.” అని వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య విబేధాలను పరిష్కరించుకునేందుకు వాణిజ్య చర్చలు ఇంకా కొనసాగుతునే వున్నాయని భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్ ఇటీవల చెప్పారు. దేశీయ ప్రాధాన్యతల విషయంలో భారత్ రాజీ పడేది లేదని ప్రధాని మోడీ కూడా స్పష్టం చేశారు. ట్రంప్ పదే పదే చేస్తున్న వ్యాఖ్యలను భారత్ కూడా ప్రతీసారీ కొట్టేస్తూ వస్తోంది.
టంప్ తీరు మారలే
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన టారిఫ్ విధానాన్ని సమర్థించుకున్నారు. కేవలం ట్రెడ్ డీల్‌తోనే ఏడు యుద్ధాలను తానే పరిష్కరించినట్టు పేర్కొన్నారు. టారిఫ్‌ల వల్ల అమెరికాకు గొప్ప చర్చల సామర్థ్యాన్ని అందిస్తుందని తెలిపారు. అమెరికా స్పేస్ కమాండ్ ప్రధాన కార్యాల యాన్ని అలబామాలోని హంట్స్‌విల్లేకు తరిలిస్తున్నట్టు ప్రకటించిన సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై కూడా ట్రంప్ స్పందించారు.’సుంకాలు ఓ మాయా చర్చల సాధనం. సుంకాలు పెంపు అమెరికా ఆర్థిక వ్యవస్థకే కాకుండా ఏడు యుద్ధాలను పరిష్కరించడానికి సహాయపడింది. అమెరికా చాలా పెద్ది, అలాగే శక్తిమంతమైన దేశం. అమెరికా లేకపోతే ప్రపంచంలో ఏది ఉండదు. మొదటి నాలుగు సంవత్సరాల్లో అమెరికా శక్తిమంతమైన దేశంగా చేశా. కానీ ఆ తర్వాత వచ్చిన జో బైడెన్ సర్కార్‌తో క్షీణించడం ప్రారంభమైంది. టారిఫ్‌లు మా దేశాన్ని ఆర్థికంగా అత్యంత శక్తివంతంగా మార్చాయి. మేం ఇప్పటి వరకు ఊహించని స్థాయికి చేర్చాం. ప్రపంచంలో మేం ఉత్తమం. అలాగే వేగంగా ఎదుగుతున్న దేశం. టారిఫ్‌ల వల్లనే ఇది సాధ్యమైంది. నేను ఏడు యుద్ధాలను పరిష్కరించా. వాటిలో చాలా యుద్ధాలు వాణిజ్యం కారణంగానే జరిగాయి.’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అవన్నీ ఫేక్ న్యూస్ : ట్రంప్
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చనిపోయారంటూ ఇటీవ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. దీనిపై స్పందిస్తూ అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేశారు. మీరు చనిపోయారంటూ వస్తున్న వార్తులు మీ దృష్టికి వచ్చాయా ? అని తాజాగా ట్రంప్‌ను ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. దానికి లేదు, తన ఆరోగ్యంపై వదంతులు వచ్చాయని మాత్రమే విన్నట్టు అని ట్రంప్ బదులిచ్చారు. ‘నేను చనిపోయాని ప్రజలు ఆలోచిస్తున్నారని నాకు తెలియదు. కానీ ఆరోగ్యం గురించి ఆందోళనలు ఉన్నాయని విన్నా. వారు ట్రంప్ బాగానే ఉన్నారా? ఎలా ఉన్నారు? అనే అంటున్నారు. ఆ ఊహాగానాల అన్ని నకిలీ వార్తలే. నేను చాలా చురగ్గా ఉన్నా’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ఏం జరిగింది..?
ట్రంప్ కొన్ని రోజులు పాటు బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడంతో మిస్సింగ్ అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవల ట్రంప్ మీడియా ముందుకురాలేదు. అలాగే ఏదైనా చెప్పాలనుకుంటే తన సొంత సోషల్ మీడి యా ట్రూత్ ద్వారానే వెల్లడించారు. ఆగస్టు 30, 31 తేదీల్లోనూ ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లు వైట్‌హౌస్ షెడ్యూల్‌లో కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యంపై అనుమనాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే ట్రంప్ ఈ మేరకు స్పందించారు.
అత్యధికంగా సుంకాలు విధించేది వారే
- Advertisement -
- Advertisement -