నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి లో గల మధుర నగర్ రెండులో మున్సిపల్ సిబ్బంది చెట్లను కొట్టి డ్రైనేజీలో వేసి వాటిని తీయడం లేదని మధుర నగర్ రెండవ లైన్ లో ఉండే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ గతవారం మున్సిపల్ కార్మికులు చెట్లు కొట్టేసి సైడ్ కాలువలో వేసి వెళ్లిపోతుంటే వాటిని తీసుకెళ్లండి అని అనగానే మళ్లీ వచ్చి తీస్తామని చెప్పి ఇప్పటికీ వారం గడిచిన ఆ చెట్ల కొమ్మలు మురుగనీటిలో అలాగే ఉండి నీరు నిలువైన దుర్వాసన వస్తుందన్నారు. మధురానగరిలో 2 లైన్ అంగన్వాడీ దగ్గర్లో ఉన్న ఈ డ్రైనేజీలో చెట్ల కొమ్మలు చేరి చెత్త నిలువ కావడంతో నీరు వెళ్లాక దోమలు వృద్ది చెందుతూ తాము ఇబ్బందులకు గురి అవుతున్నామన్నారు. మొన్నటి వర్షంలో చక్కగా ఉన్న మా ఏరియాలో ఇలా చేస్తే ఎలా అని ఆవేదన చెందుతున్నారు.
చెట్లు నరికారు.. తీయడం మరిచారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES