Saturday, December 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ పార్టీ బలపరిచారు.. తర్వాత వద్దన్నారు

కాంగ్రెస్ పార్టీ బలపరిచారు.. తర్వాత వద్దన్నారు

- Advertisement -

రెబల్ అభ్యర్థి దిగంబర్ వెంటే జనాలు
నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ మండలంలోని 21 గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల ప్రకటనలో చిన్న షక్కర్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా దిగంబర్ పేరు ప్రకటించారు. ఆ తర్వాత ఆ వ్యక్తి కాదు చిన్న షక్కర్గా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాండురంగ పార్టీ అంటూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు పాండురంగ పటేల్ కు ఉన్నప్పటికీ రెబల్ అభ్యర్థిగా మిగిలిపోయిన దిగంబర్ వెంటే జనాలు భారీగా ప్రచారంలో పాల్గొంటున్నారు. పార్టీ అన్యాయం చేసిన గెలుపు తనదేనంటూ రెబల్ అభ్యర్థికి జనాలు జై కొడుతున్నారు. దిగంబర్ అనే నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని జెండాను మోస్తుంటే తన పేరును ప్రకటించి ఆ తర్వాత నీవు కాదు పాండురంగ పాటిల్ కాంగ్రెస్ అభ్యర్థి అంటూ కాంగ్రెస్ పార్టీ తనను అన్యాయం చేసిన జనాలు తనవెంటే ఉన్నారని గెలుపు తనదేనని దిగంబర్ ముమ్మర ప్రచారంలో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -