Monday, December 15, 2025
E-PAPER
Homeదర్వాజవాళ్లే గెలిచారు

వాళ్లే గెలిచారు

- Advertisement -

ఆకాశ మంత ఆనందాన్ని వదిలి
విశాలమైన బాల్యపు పూదోటని వదిలి ఆటలను, పాటలను, వెన్నెల మాటలను చూపుల్లో అనంతమైన నమ్మకాన్ని వదిలి
సబ్బు నురగతో బెలూన్లు ఊదినట్లు
పండు నుంచి గింజలు విసిరేసినట్టు
చావును విసిరేసి వెళ్లిపోయారు వాళ్ళు .
వాళ్ళని వాళ్ళు ఇక చాలు అనుకుని
ఆ సూర్యోదయపు ఎర్రని ఆటస్థలం,
ఆ సాయంసందె రంగువాకిలి
ఇక మావి కావని మాకి నేల దక్కదని
యుద్దోన్మాదుల నెత్తుటి తాపం కోసం
వాళ్ళ అహంకార దర్పం కోసం వాళ్లు చావును భుజంపై పారుతున్న బొద్దింకనువిసిరేసినట్టు విసిరివెళ్ళిపోయారు.
వెళ్లిపోతూ వెళ్లి పోతూ వాళ్ళ యుద్ధ ట్యాంకుల నిండా
రక్తాన్ని నింపి వెళ్లిపోయారు.
నిజానికి వాళ్లే గెలిచారు సేపు లొచ్చిన పాలిండ్లను ఇచ్చి
పక్కనున్న రేపటి కనుపాపల్ని ఇచ్చి
పెనం మీదున్న రొట్టెను కొనవేలుతో
అందుకుంటూ అందుకుంటూ ఆసరా దొరకని సమయంలో
ఇన్ని దుఃఖపు నీళ్లిచి వాళ్ళు సామూహికంగా,శవాలుగా, రాలినపూలుగా వెళుతూ వెళుతూ వాళ్ళు గెలుపును వెంటేసుకొని వెళ్లారు.
ఎక్కడో తరిమేయబడి గాయాలతో
కాళ్ళ ముందు శరను చేతులు చాపితే
చివరికి తానే రక్తపింజరై పాల సముద్ర మొక్కల విషమై
ద్వీపమే సముద్రాన్ని పిల్చేసినట్లు నేల లేనోడు మూలవాసులకు నీడ లేకుండా చేశాడు
వీచే గాలికి తెలుసు మహా వక్షాలను పెకిలించే విద్య
కురిసే మేఘానికి తెలుసు వరదల చేతులతో
కొండచిలువల నియంతల్ని మింగేయడం
ఇప్పుడు శిథిలాల కింది గులాబీ రేకులు
రాళ్ల మధ్య తల్లుల అరుపులు
కాలి బూడిదలైన అర్ధరాత్రి సూర్యుల్లు
ఇన్ని వసంతాల్ని స్మశానం చేసిన కబ్జాదారుల్ని మధ్యధరా సముద్రంలోని తిమింగలాలకు ఎలా వేయాలో
కాలం రెప్పవేయని కళ్ళతో కాచుకొని చూస్తున్నది
బూడిదైనా దేశానికి మద్దతు కేక వేయాలని
వాళ్లే నిజమైన విజేయులని
డా.ఉదారి నారాయణ, 9441413666

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -