Wednesday, August 6, 2025
E-PAPER
Homeజాతీయంఎంపీ గొలుసు చోరీ చేసిన దొంగ అరెస్ట్

ఎంపీ గొలుసు చోరీ చేసిన దొంగ అరెస్ట్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కాంగ్రెస్ మహిళా ఎంపీ ఆర్. సుధ మెడలోంచి బంగారు గొలుసును లాక్కెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు పాల్పడిన పాత నేరస్థుడు సోహన్ రావత్ (24)ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి చోరీకి గురైన గొలుసుతో పాటు స్కూటర్, హెల్మెట్, దుస్తులతో పాటు చోరీ చేసిన కొన్ని మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడైన సోహన్ రావత్ ఇటీవలే జైలు నుంచి విడుదలైనట్లు, అతనిపై ఇప్పటికే 26 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

రెండు రోజుల క్రితం తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఆర్. సుధ తోటి ఎంపీ రాజాతో కలిసి ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలో మార్నింగ్ వాక్ చేస్తున్నారు. చెక్ రిపబ్లిక్ రాయబార కార్యాలయం సమీపంలోకి రాగానే, ఫుల్ ఫేస్ హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి స్కూటర్‌పై వేగంగా వచ్చి సుధ మెడలోని బంగారు గొలుసుతో ఉడాయించాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -