Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపటి నుంచే మూడవ విడత నామినేషన్లు

రేపటి నుంచే మూడవ విడత నామినేషన్లు

- Advertisement -

నామినేషన్ల స్వీకరణ కేంద్రాల ఏర్పాటు
మండల ఎంపీడీవో క్రాంతికుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు

స్నానిక ఎన్నికల్లో భాగంగా మండలంలో ఈ నెల 3 నుంచి 5 వరకు మూడవ విడత ఎన్నికల స్వీకరణకు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఎంపీడీవో క్రాంతికుమార్ మంగళవారం  తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మం డలంలో 15 గ్రామపంచాయతీలకు గాను నామినేషన్ల స్వీకరణకు 5 క్లస్టర్లను ఎంపిక చేశామని తెలిపారు. క్లస్టర్ల వారిగా గుర్తించిన గ్రామాలు ఆయా క్లస్టర్లలో నామినేషన్లను దాఖలు చేసుకోవాలని తెలిపారు. సర్పంచులతోపాటు వార్డుసభ్యులు నామినేషన్ దాఖలు చేయాలన్నారు. నామి నేషన్ క్లస్టర్లకు రెండు నుండి మూడు గ్రామాలను కేటాయించామని తెలిపారు.

1, తాడిచెర్ల క్లస్టర్ (జీపీ బిల్డింగ్) లో తాడిచెర్ల, మల్లారం,చిన్నతూoడ్ల గ్రామాలు, 2, పెద్దతూండ్ల క్లస్టర్(జీపీ బిల్డింగ్) లో పెద్దతూండ్ల,అడ్వాలపల్లి,దుబ్బపేట గ్రామాలు, 3, కొయ్యుర్ క్లస్టర్(ఎమ్మార్సీ బిల్డింగ్) లో కొయ్యుర్, రుద్రారం,ఎడ్లపల్లి గ్రామాలు, 4, వళ్లెంకుంట క్లస్టర్(జీపీ బిల్డింగ్) లో వళ్లెంకుంట,ఇప్పలపల్లి, కొండంపేట గ్రామాలు, 5, ఆన్ సాన్ పల్లి క్లస్టర్ (జీపీ బిల్డింగ్) లో ఆన్ సాన్ పల్లి, మల్లంపల్లి, నాచారం గ్రామాలకు చెందిన సర్పంచ్, వార్డు సభ్యు ల అభ్యర్థులు నామినేషన్లు వేసుకోవాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియ ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం ఐదు. గంటల వరకు ఉంటుందని తెలిపారు. ఎలాంటి గొడవలకు తావివ్వకుండా ప్ర శాంతమైన వాతావరణంలో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు నామినేషన్లు వేసుకోవాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియకు ఇబ్బందులు కాకూడదనే ఉద్దేశంతో క్లస్టర్లను గుర్తించామని తెలిపారు.అభ్యర్థులు సమయపాలనను పా టించి నామినేషన్లు స్వీకరించే అధికారులకు సహకరించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -