నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని జుక్కల్ గ్రామంలో రైతు వేదిక యందు వార్డు సభ్యుల ముగింపు శిక్షణ కార్యక్రమంలో శ్రీయుత ముఖ్య కార్యనిర్వహణ అధికారి చందర్ నాయక్ (CEO) ZPP కామారెడ్డి పాల్గొనడం జరిగిందని ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా మొదటగా రైతు వేదిక ఇందు ఇచ్చిన పూర్తి చేసుకున్న వాడు సభ్యులకు జడ్పీ సీఈవో వారితో శిక్షణ తరగతులు విన్న మీరు ఏమి నేర్చుకున్నారని ప్రశ్నించారు.పలువురు వార్డు సభ్యులు వాటికి సమాధానాలు ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేశారు. శిక్షణానంతరం వాట్సప్ లకు శిక్షణ సర్టిఫికెట్ లను వార్డు సభ్యులకు అందించడం జరిగింది. అనంతరం మండలంలోని హంగర్గ జిపి మరియు మాదాపూర్ జిపి లను ఆకస్మికంగా అభివృద్ధి పనులను తనిఖీలు చేశారు.
రెండు జిపి గ్రామాలలోని పలు పనులపై పరిశీలన చేయడం జరిగింది. ఉపాధి హామీ పనులను పరిశీలించడం జరిగింది. గ్రామాలలో నర్సరీలో పెంచుతున్న మొక్కలను పరిశీలించి సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ మాట్లాడి నిత్యం వాటికి నీరా అందించాలని ఎండ ఎక్కువగా కావడంతో ఈరోజు రెండు పూటలు మొక్కలకు నీరందించాలని జిపి కార్యదర్శులకు ఆదేశించారు. గ్రామాలలో నిర్మాణాలు చేస్తున్న ఇందిరమ్మ గృహ లను సందర్శించారు. లబ్ధిదారులతో మాట్లాడి బిల్లు వస్తున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ గృహలు మంజూరైన ప్రతి ఒక్క లబ్ధిదారులు నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు.
సమయపాలన పాటించాలని గర్భిణులకు బాధితులకు నిత్యం వైద్య పరీక్షలు నిర్వహించి ప్రభుత్వం అందిస్తున్న పోషక ఆహారాలు వారికి అందించాలని ఆదేశించారు. అదేవిధంగా ఈ గ్రామాలలో ప్రైమరీ స్కూల్ లకు వెళ్లి విద్యార్థులకు మాట్లాడారు. మధ్యాహ్నం భోజనం పథకం సక్రమంగా నిర్వహి స్తున్నారని మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి వి గ్రామం తల్లిదండ్రుల పేర్లను గొప్పగా చెప్పుకునే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ తో పాటు జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్. ఎంపీవో రాము , మాదాపూర్ సర్పంచ్ ఆశా చందర్ పటేల్, హంగర్గ సర్పంచ్ కుమ్మరి నర్సింలు, జిపి కార్యదర్శి అశోక్ గౌడ్, వార్డ్ సభ్యుల కు ఇచ్చిన శిక్షకులు నాగయ్య , అశోక్ గౌడ్, దివాకర్ , పలు గ్రామాల జిపి వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



