కుల్గాం సీపీఐ(ఎం) ఎమ్మెల్యే ఎం వై తరిగామి
వెనిజులాలో అమెరికా సైనిక చర్యకు ఖండన
జమ్మూ కాశ్మీర్‌లో నిరసన ప్రదర్శన
కుల్గాం : అమెరికా చర్య అంత ర్జాతీయ చట్టాలను ఉల్లంఘిం చిందని, నిరా యుధ ప్రజలపై బల ప్రయోగం చేసిందని, ఇది అనాగరిక చర్య అని కుల్గాం సీపీఐ(ఎం) ఎమ్మెల్యే ఎం వై తరి గామి అన్నారు. వెనిజులాలో అమెరికా సైనిక చర్యను ఖండిస్తూ మంగళవారం జమ్మూలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్శంగా తరిగామి మాట్లాడుతూ.. ఇటువంటి చర్యలు ఐక్య రాజ్యసమితి భద్రతా మండలి అధి కారాన్ని, సార్వభౌమ దేశాలపై దురా క్రమణను నిరోధించడానికి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ చట్టపరమైన చట్రాన్ని దెబ్బతీస్తాయని అన్నారు. ఈ చర్య ప్రపంచ వ్యాప్తంగా చారిత్రాత్మక ప్రజా నిరసనలకు దారితీసిందని, భారతదేశంలోని పౌర సమాజ సమూహాలు , రాజ కీయ పార్టీలు కూడా ఈ దురాక్రమణ చర్యకు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయని తెలిపారు. ” సామూహిక విధ్వంసక ఆయుధాల గురించి తప్పుడు వాదనలు చేసిన తర్వాత అమెరికా ఇరాక్‌ను నాశనం చేసి, వాటిని నిరూ పించలేకపోయింది. లిబియాను ప్రజా స్వామ్యం పేరుతో అస్థిరపర్చింది. ఆఫ్ఘ నిస్తాన్ గందర గోళంలో పడింది. నేడు వెనిజులాను మాదకద్రవ్యాల అక్రమ రవాణా కారణంగా కాకుండా దాని చమురు నిల్వల కారణంగా లక్ష్యంగా పెట్టుకుంది” అని ఆయన అన్నారు.
కేంద్ర ప్రకటనను పున: సమీక్షించాలి
అమెరికాపై కేంద్రం జారీచేసిన ప్రకట నను పున:సమీక్షించాలని సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు తరిగామి డిమాండ్ చేశారు. ట్రంప్ బహిరంగ దురాక్రమణకు వ్యతిరేకంగా బలమైన సందేశం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇది అనాగరిక చర్య
- Advertisement -
- Advertisement -



