Sunday, January 11, 2026
E-PAPER
Homeసినిమాఇది పక్కా పండగ సినిమా

ఇది పక్కా పండగ సినిమా

- Advertisement -

హీరో శర్వా, దర్శకుడు రామ్‌ అబ్బ రాజు కాంబోలో రాబోతున్న చిత్రం ‘నారి నారి నడుమ మురారి’.
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అడ్వెంచర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథనాయికలు.
ఈనెల 14న ఈ చిత్రం థియేటర్ల లోకి రానుంది. ఈ సందర్భంగా కథానాయిక సంయుక్త మీడియాతో ముచ్చటించారు.
మా సినిమా కూడా సంక్రాంతికి రావడం చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి చాలా పెద్ద పండుగ. ఈ పండగకి వచ్చే ప్రతి సినిమాకి మంచి ఆదరణ ఉంటుంది. ఇది చాలా క్లీన్‌ కామెడీ ఎంటర్టైనర్‌. పండుగకి పర్ఫెక్ట్‌ మూవీ.
డైరెక్టర్‌ ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. వెరీ బ్యూటీఫుల్‌ స్టోరీ. నాకు కామెడీ సినిమా చేయడం చాలా ఇష్టం. ఇందులో నా క్యారెక్టర్‌కి చాలా ఇంపార్టెన్స్‌ ఉంటుంది. ఇద్దరు హీరోయిన్స్‌ ఉన్నప్పుడు ఆడియన్స్‌ సహజంగా ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ అనుకుంటారు. కానీ ఇది అలా కాదు. డైరెక్టర్‌ చాలా యూనిక్‌ పాయింట్‌తో ఈ కథ రాశారు. అది మీరు స్క్రీన్‌ మీద చూడాలి.
దర్శకుడు నాకు చాలా మంచి క్యారెక్టర్‌ ఇచ్చారు. ఇందులో చాలా మంచి సిచ్చ్యువేషనల్‌ కామెడీ ఉంటుంది. ఈ సినిమాకి నేనే డబ్బింగ్‌ చెప్పాను. చాలా ఎంజారు చేశాను. శర్వానంద్‌ చాలా అద్భుతమైన టైమింగ్‌ ఉన్న హీరో. ఆయనతోపాటు నరేష్‌, సత్య పాత్రలు కూడా అందరినీ అలరిస్తాయి.
డైరెక్టర్‌ చాలా కూల్‌గా ఉంటారు. ఇంత కాంపిటీషన్లో సినిమా వస్తున్న ఆయనకు ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఎప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. చాలా క్లారిటీ వున్న డైరెక్టర్‌. నిర్మాత అనిల్‌కి సినిమా అంటే చాలా ప్యాషన్‌. సినిమాకి ఆయనే మెయిన్‌ పిల్లర్‌. ఆయన కోసం చాలా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను. సాక్షి వైద్య, మా మధ్య మంచి కాంబినేషన్‌ సీన్లు ఉన్నాయి. ‘బ్లాక్‌ గోల్డ్‌’ ఫిబ్రవరిలో షూటింగ్‌ పూర్తి కావచ్చు. సినిమా చాలా బాగా వస్తోంది. దీనితోపాటు పూరీ జగన్నాథ్‌ సినిమా చేస్తున్నాను.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -