నవతెలంగాణ – మల్హర్ రావు
పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులకు ఒక వేళ చెరి సమానంగా ఓట్లు వచ్చిన సమయంలో టాస్ కీలకంగా మారుతుంది. రాజ్యాంగంలోని ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్102 ప్రకారం ఎన్నికల కమిషన్ లాటరీ పద్ధతిన అభ్యర్థి ఎన్నికకు అవకాశం కల్పిస్తుంది. లాటరీలో ఎవరు గెలుపొందుతారో వారిని విజేతలుగా ప్రకటిస్తారు. సమానంగా ఓట్లు వచ్చిన ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఒకే రంగు, సైజు గల ఐదు చీటిలపై రాస్తారు. ఇద్దరు అభ్యర్థుల సమక్షంలో రిటర్నింగ్ అధికారి వీటిలో నుంచి ఓ చీటీని డ్రా తీస్తారు.అందులో ఎవరి పేరు వస్తుందో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఒక వేళ బరిలో ముగ్గురు, నలుగురు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే విజేతను ఎలా గుర్తించాలన్న ప్రశ్నకు రాజ్యాంగంలో స్పష్టం చేయలేదని అధికారుల సమాచారం.
ఓట్లు సమానంగా వస్తే విజేతను తేల్చేది ఇలా!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



