Thursday, July 31, 2025
E-PAPER
Homeజాతీయంఇది ఆరంభమే..

ఇది ఆరంభమే..

- Advertisement -

– కార్మిక వర్గానికి సీసీజీజీఓఓ అభినందనలు
న్యూఢిల్లీ :
సార్వత్రిక సమ్మెను అఖిల భారత స్థాయిలో విజయవంతం చేసిన కార్మిక వర్గానికి కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్‌ ఆఫీసర్‌ సంఘాల సమాఖ్య (సీసీజీజీఓఓ) అభినందనలు తెలియచేసింది. అనూహ్య మైన రీతిలో కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు, వివిధ రంగాలకు చెందిన ప్రజలు ఏకమై కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా నిరసించారని పేర్కొంది. తదుపరి దశలో సమైక్య కార్యాచర ణలకు ఇది ఆరంభమని వ్యాఖ్యానించింది. ఈ మేరకు సీసీజీజీఓఓ జాతీయ చైర్మెన్‌, పెన్షనర్లు, రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి వి.కృష్ణ మోహన్‌ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. చారిత్రక రీతిలో కార్మిక వర్గం ప్రదర్శించిన ఈ ఐక్యత, నిబద్ధత, కేంద్ర ప్రభుత్వానికి, కార్పొరేట్‌ శక్తులకు ఒక స్పష్టమైన సందేశాన్ని పంపిం దని ఆ ప్రకటన పేర్కొంది. కార్మికుల హక్కు లను కాలరాసి, వారి శ్రమను దోపిడీ చేస్తే సహించేది లేదని స్పప్టం చేసింది. ఈ సమ్మెతో దేశ ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలు స్తంభించాయి.

కింది స్థాయి నుంచి కీలకమైన పరిశ్రమల వరకు కార్మికులందరూ ఏకతాటిపై నిలిచారు.న్యాయం కావాలని నినదించారని ఆ ప్రకటన పేర్కొంది. బొగ్గు, ఖనిజ రంగాలు, బ్యాంకులు, ఎల్‌ఐసీ, ఓఎన్‌జీసీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా పోస్టల్‌, ఆదాయపన్ను, ఆడిట్‌, టెలికం ఇలా పలు రంగాలకు చెందిన వారు సమ్మెలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జూట్‌, జౌళి, ఐటీ, మెడికల్‌, సేల్స్‌ రిప్రజెంట ేటివ్‌లు, పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రయివేటు రవాణా రంగ కార్మికులు, విద్యుత్‌, రక్షణ, రైల్వే, సహాపలు రంగాలకు చెందిన వారు పాల్గొన్నారు. అన్నిరాష్ట్రాల్లో ఏఐకేఎస్‌, ఎఐఏడబ్ల్యూయూ, ఎస్కేఎం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రైతులు, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో రంగాలవారీ పోరాటాలతో సుదీర్ఘ పోరు సాగించేందుకు ఇది ప్రారంభం మాత్రమేనని సీసీజీజీఓఓ పేర్కొంది. కార్మిక, కర్షకుల మధ్య ఐక్యత మరింత పెరిగి, ప్రత్యామ్నాయ విధాన వ్యవస్థ కోసం పెద్ద ఎత్తున, సమైక్య జాతీయో ద్యమంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్టు ఆ ప్రకటన పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -