Monday, November 17, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఈ రాముడు.. అందరివాడు

ఈ రాముడు.. అందరివాడు

- Advertisement -

అనుముల ప్రొడక్షన్స్‌, శ్రీరామ్‌ క్రియేషన్స్‌ సంయుక్తంగా యద్దనపూడి మైకిల్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘మా రాముడు అందరివాడు’. శ్రీరామ్‌, స్వాతి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సుమన్‌, సమ్మెట గాంధీ, నాగ మహేష్‌, బాహుబలి ప్రభాకర్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మాతలు. త్వరలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీజర్‌, ఆడియో లాంచ్‌ కార్యక్రమం పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ప్రసాద్‌ లాబ్స్‌లో ఘనంగా జరిగింది. నటుడు బాబు మోహన్‌ మాట్లాడుతూ, ‘చిత్ర పరి శ్రమలో ఎంతో పెద్ద హీరోలు పెట్టుకునే స్థాయిలో ఈ చిత్ర టైటిల్‌ చాలా బావుంది.

ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలి. నిర్మాత లక్ష్మణ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ సినిమాలో గద్దర్‌ నరసన్న పాట పాడటం ప్రత్యేకం’ అని తెలిపారు. ‘ఈ సినిమాలో ఉన్న 4 పాటలను నేను రాయటం చాలా గర్వంగా ఉంది. మంచి కథతో మీ అందరి ముందుకు రాబోతున్నాం’ అని దర్శకుడు మైకిల్‌ చెప్పారు. నిర్మాత లక్ష్మణ్‌ రావు మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీరామ్‌, నటి స్వాతి.. ఇంకా ఎంతో మంది పేరొందిన నటీనటులు సినిమాలో నటించినందుకు థ్యాంక్స్‌. అలాగే దర్శకుడు మైకిల్‌ ప్రాణం పెట్టి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. మా సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించి, మంచి విజయాన్ని అందచేయాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -