సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కర్టెన్ రైజర్ ఈవెంట్ శనివారం సాయంత్రం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో ఘనంగా జరిగింది.
నటులు మురళీ మోహన్, నిర్మాత కేఎస్ రామారావు, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సూర్యనారాయణ, నిర్మాత ఏడిద రాజా, రామసత్యనారాయణ, స్పాన్సర్స్ సూర్య సెమ్ డైరెక్టర్స్ అనిల్, డా. సురేష్ బాబు, వి.వి.కె.హౌసింగ్ ఇండియా ప్రైవెట్ లిమిట్ అధినేత వళ్లూరు విజయకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. అలాగే ఈ వేడుకకు శ్రీ విజయ వారాహి మూవీస్ సంస్థ కో స్పాన్సర్‌గా, మ్యూజిక్ పార్ట్‌నర్‌గా ఆదిత్య మ్యూజిక్ వ్యవహరిసున్నారు.
సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి మాట్లాడుతూ, ’35 ఏళ్లుగా నేను జర్నలిస్ట్‌గా ఉన్నాను. 85కు పైగా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను. 16 సినిమాలు నిర్మించా. అలాగే 600 సినిమాలకు పీఆర్‌ఓగా పనిచేశా. చిరంజీవి, బాలకష్ణ, రజనీకాంత్ వంటి స్టార్స్ సినిమాలు పీఆర్‌ఓగా చేశాను. నాకు చిరంజీవి, నాగార్జున రెండు కళ్లలాంటి వారు. నాగార్జున మాటల స్ఫూర్తితో నేను కనీసం 25 ఏళ్లు ఫిలిం అవార్డ్స్ ఈవెంట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇది 24వ సంవత్సరం. గత సంవత్సరాలకు మించి ఈ ఈవెంట్ చేయబోతున్నాం. నా స్పాన్సర్స్ అందరికీ కతజ్ఞతలు’ అని తెలిపారు.
ఈసారి అంతకుమించి..
- Advertisement -
- Advertisement -