Sunday, July 27, 2025
E-PAPER
Homeసినిమాఅవన్నీ అసత్య ఆరోపణలే..

అవన్నీ అసత్య ఆరోపణలే..

- Advertisement -

హైదరాబాద్‌లోని చిత్రపురి కాలనీ పై కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఆరోపణలు మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. వాటిపై ఒక క్లారిటీ ఇస్తూ చిత్రపురి కాలనీ అధ్యక్షులు వల్లభనేని అనిల్‌ కుమార్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ,’700 నుండి 850 కోట్ల మధ్య ఉన్న చిత్రపురి కాలనీ పై సుమారు 3000 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు మాట్లాడుతున్నారు. అవినీతి జరిగింది అంటూ మా దగ్గర ఆధారాలు ఉన్నాయని మాట్లాడేవారు వారి దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుని వస్తే బహిరంగంగా మాట్లాడేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసాం. కాని ఎవరు రాలేదు. 2009లోనే పర్మిషన్లు తీసుకుని రో హౌసులు నిర్మించాం. ఆ తర్వాత 2017లో కూడా మరికొన్ని పర్మిషన్లతో జీ2గా మరి కొన్ని రో హౌసులు నిర్మించాం. అవి అన్ని పరిష్మన్‌ తోనే జరిగాయి. కాని కొంతమంది కేసులు పెట్టిన కారణంగా ఆ కట్టడాలను ఆపడం జరిగింది. సఫైర్‌ సూట్‌ నిర్మించేందుకు అన్ని పర్మిషన్లతోనే ముం దుకు వెళ్తున్నాం. శ్రావణమాసంలో కొత్త నిర్మాణాలు మొదలు పెట్టనున్నాం. చుట్టుపక్కల ఉన్న ఎన్నో గేటెడ్‌ కమ్యూనిటీలకు తగ్గట్లు అన్ని రకాల ఎమినిటీస్‌తో సఫైర్‌ సూట్‌ నిర్మించబోతున్నాం. ఈ కొత్త ప్రాజెక్టు పూర్తి కాకపోతే కాలనీ మనుగడకే సమస్య వచ్చే అవకాశం ఉంది. మొత్తం 51 అంతస్థుల భవనంలో సఫైర్‌ సూట్‌ ప్లాన్‌ చేస్తున్నాం’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -