రాహుల్‌గాంధీ విమర్శలపై స్పందించిన బ్రెజిల్ మోడల్
న్యూఢిల్లీ : హర్యానాలో పది బూత్‌ల్లో నకిలీ ఓట్ల కోసం బ్రెజిల్ మోడల్ లారిస్సా ఫోటోలను ఉపయోగించారని కాంగ్రెస్ నాయకులు రాహుల్‌గాంధీ చేసిన విమర్శలపై సదరు మోడల్ స్పందించారు. ఆ ఫోటోలు తనవేనని, తన పాత ఫోటోలను దుర్వినియోగం చేశారనే విషయం తనకు తెలియదని చెప్పారు. అలాగే, భారత్‌లో ఎన్నికల గురించి ఏమీ తెలియదని చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. పోర్చుగీస్ భాషలో ఆమె మాట్లాడారు.
హర్యానా ఓటర్ల జాబితాలో తన ఫోటోను అనేక సార్లు ఉపయోగించారనే విషయం తెలిసి తాను దిగ్భ్రాంతికి గురైనట్లు లారిస్సా వెల్లడించారు. తన 18, 20 ఏండ్ల్ల వయస్సులోని ఫోటో అని తెలిపారు. తన ఫోటోను ఓటర్ల జాబితాలో ఉపయోగించిన విషయం ఒక విలేకరి ద్వారా తనకు తెలిసిందని చెప్పారు. ముందుగా తాను పనిచేస్తున్న సెలూన్‌కి ఫోన్ చేశారని, తాను పట్టించుకోలేదని తరువాత నా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విషయాన్ని వెల్లడించారని చెప్పారు. కాగా, కొన్ని నివేదికల ప్రకారం లారిస్సా మోడల్ కాదు. బ్రెజిల్‌లోని బెలోహారిజాంటేలో ఒక సెలూన్ నిర్వహిస్తున్నారు.
అవి నా ఫోటోలే..
- Advertisement -
- Advertisement -



