– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లు దోచుకున్న వారిని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి అన్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం పైన కొన్ని రోజులుగా విచారణ జరిపి, జస్టిస్ గోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా శాసనసభలో కేసును సిబిఐకి అప్పగించాలని తీర్మానం చేశారన్నారు. ఏ తప్పు చేయలేదని బిఆర్ఎస్ నాయకులు ప్రగల్భాలు పలకడం కంటే, సీబీఐ కేసును ఎదుర్కొని నిజాయితీనీ నిరూపించుకోవాలన్నారు.
సాక్షాత్తు కేసీఆర్ కూతురు కవిత, హరీష్ రావు, సంతోష్ రావు అవినీతికి పాల్పడ్డారని చెబుతున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు చెక్కు చెదరకుండా ఉంటే, మొన్న కట్టిన కాళేశ్వరం కుంగి పోవటం వీళ్ల అవినీతికి నిదర్శనమని తెలిపారు. అవసరంలేని ప్రాజెక్టులు కట్టి తెలంగాణను దోచుకున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బీఆర్ఎస్ చేసిన అవినీతిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పడిగేల ప్రవీణ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, పట్టణ అధ్యక్షుడు సల్లూరి గణేష్ గౌడ్, నూకల బుచ్చి మల్లయ్య, సుంకేట శ్రీనివాస్, సింగిరెడ్డి శేఖర్, గోపిడి లింగారెడ్డి, రేవతి గంగాధర్, పూజారి శేఖర్, సింగిరెడ్డి ప్రతాప్, నల్ల గణేష్ గుప్తా, సుంకరి గంగాధర్, సుంకరి రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లు దోచుకున్న వారిని శిక్షించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES