Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంవేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు

వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు

- Advertisement -

– వరదలకు పొలాల్లో ఇసుక మేటలు
– ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ పంట నష్టం


నవతెలంగాణ- విలేకరులు
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు, వరద ప్రభావానికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మంచిర్యాల జిల్లాలోని గోదారి పరివాహక ప్రాంతాలైన జన్నారం, లక్షెట్టిపేట, హాజీపూర్‌ మండలాల్లో వివిధ పంటలు వేల ఎకరాల్లో నీట మునిగాయి. పలు గ్రామాల్లో పొలాల్లో ఇసుక మేటలు వేయగా, రోడ్లు భారీగా కోతకు గురయ్యాయి. జైపూర్‌ మండలంలో వేలాల, కిష్టాపూర్‌, పౌనూర్‌, శివ్వారం గ్రామాల్లో సుమారు 600 ఎకరాల పంటలు గోదావరి వరద ఉధృతికి నీట మునిగాయి. కుమురంభీం-ఆసిఫాబాద్‌ జిల్లాలోని కౌటాల, దహెగాం, బెజ్జూర్‌, చింతలమానేపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో పంటపొలాలను ప్రాణహిత బ్యాక్‌ వాటర్‌ ముంచెత్తింది. నిర్మల్‌ జిల్లాలో వరద ఉధృతికి ఆస్తి నష్టంతోపాటు పంటలు, రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బాసర మండలంలో గోదావరి పరివాహక ప్రాంతంలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శుక్రవారం ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్‌, నిర్మల్‌ కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ భైంసా పట్టణంలోని రావుల్‌నగర్‌, ఆటోనగర్‌, దేగామ వంతెన, కుంటాల మండలంలోని అందకూరు బ్రిడ్జిని పరిశీలించారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని పెన్‌గంగ పరివాహక ప్రాంతాలైన తాంసి, భీంపూర్‌, జైనథ్‌, బేల, భోరజ్‌ మండలాల్లో పంటలు నీట మునిగాయి. తలమడుగు మండలంలో రుయ్యాడి, ఖోడద్‌, భరంపూర్‌, కజ్జర్ల గ్రామాల్లో వాగులు పొంగిపొర్లడంతో పంటపొలాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. జిల్లా వ్యాప్తంగా 18 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. 2 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. సుమారు రూ.10 లక్షల నష్టం వాటిల్లినట్టు విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ జేఆర్‌ చౌహాన్‌ తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad