కాలం మంచులా
కరిగి పోతున్న దృశ్యంలో
చీకటి దారులను చీల్చుతూ
వెలుగు రేఖలు విచ్చుకోవటం
ప్రకృతి సహజ సందఠం
ఎగసిపడే ఆశల అలలు
కలల్ని అలుముకునే ఉంటాయి
పనిలో గట్టి ప్రయత్నమే
మనల్ని నిలబెట్టే ఆయుధమవుతుంది
సంకల్పాల ఉధృతిని
ఏ కాలమూ కాలరాయలేదు
కనుమరుగు చేయలేదు
నిరంతర శ్రమ జీవన క్రియలే
విజయ పతాక గీతికలవుతాయి
కాల గమనంలో పాత జ్ఞాపకాలేవీ తరలిపోవు
ఎదను చుట్టుకొని మదిని పట్టుకొని
కొత్త పుంతలను తొక్కమంటూ
దిశా నిర్దేశం చేస్తుంటాయి
పన్నెండు పేజీల క్యాలెండర్‌ను
ప్రతీ కొత్త వత్సరం పదునైన ప్రగతి ఎజండాను
మన బ్రతుకు బొచ్చెలో వడ్డించి పోతుంది
క్రొంగోత్త భావాల సంచిని
మన భుజానికి తగిలించి పోతుంది
కాలపు కచేరీలో కష్ట సుఖాలు జగల్బందీ వాయిద్యాలు
తిథులు…వారాలు… అంకెలూ
మారుతూ ఉండవచ్చుకానీ…
ఈ చక్రబంధంలో ముగింపు ప్రారంభాలు ఉండవు
కొత్త పొద్దంటూ ఏమీ ఉండదు
ఎప్పటి లాగే సూర్యుడు ఉదయిస్తాడు
మనమే కొత్త అడుగులు వేయాలు
అరుణ అరుణ పతాకాలమై ఎగరాలి
ఎన్ని హంగులూ ఆరాటాేలు అవలంభించినా
ఊహలకు రెక్కలు కట్టుకొని ఎగిరినా
కొత్తకూ పాతకూ మధ్య
తెగకుండా మనల్ని అంటి పెట్టుకునేది స్మృతుల దారమే…!
– డా.కటుకోఝ్వల రమేష్, 9949083327
స్మృతుల దారం
- Advertisement -
- Advertisement -



