Thursday, July 31, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంట్రేడ్‌ ఒప్పందాలతో భూములకు ముప్పు

ట్రేడ్‌ ఒప్పందాలతో భూములకు ముప్పు

- Advertisement -

– భూములు కబ్జా చేయటానికే కార్పొరేట్‌ వ్యవసాయం..
– మోడీ ప్రభుత్వ మద్దతుతో బలవంతపు భూసేకరణ
– ఆగస్టు 13న క్విట్‌ కార్పొరేట్‌-సేవ్‌ కంట్రీ, సేవ్‌ ల్యాండ్స్‌, సేవ్‌ పూర్‌ పీపుల్‌ను జయప్రదం చేయండి : అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పేదల వద్ద ఉన్న భూములను కాపాడుకోవటానికి, భూపం పిణీ కోసం సమరశీల పోరాటాలు ప్రారంభించాలని, ప్రభుత్య విధానాలను ప్రతిఘటించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌ పిలుపునిచ్చారు. మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో జరిగిన భూమి అధికార ఆందోళన్‌ సమావేశాల్లో బి.వెంకట్‌ మాట్లాడారు. అభివృద్ధి పేరుతో కేంద్ర ప్రభుత్వ అండతో లక్షల ఎకరాల భూమిని బలవం తంగా స్వాధీనం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్యమే భూ కబ్జా, మాఫియాగా మారిందని రక్షించే వారే భక్షకులుగా మారారని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో భూసేకరణ, నిర్వాసితుల సమస్యలు ముఖ్యమైన సమస్యలని తెలిపారు. వంద ఎకరాలు అవసరం ఉన్న చోట ప్రభుత్వాలు వేల ఎకరాలు కంపెనీ లకు కేటాయించి దేశ వనరులను నాశనం చేస్తున్నాయని మండిపడ్డారు. ధనవంతులకు, కంపెనీలకు భూము లు, వనరులు ఇవ్వటానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడుతున్నాయని విమర్శించారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లో బరితెగించి చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నారనీ ఆంద్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు పరిధిలో లక్షలాది. మంది గిరిజనలు నిర్వాసితులు అవుతు న్నారని చెప్పారు. అయినా ఇంకా ఆ ప్రాజెక్టు ఎత్తు పెంచి మరింత ఎక్కువ మందిని, ప్రాంతాలను నీటి మయం చెయ్యాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ల త్రయం గిరిజనుల, పేదల భక్షకులుగా మారారని విమ ర్శించారు. ఈ విధానాలకు వ్యతిరే కంగా పేదలు, వ్యవసాయ కూలీలు, ప్రజలు ప్రత్యక్ష భూ పోరాటాలు నడపాలని అన్నారు. ఆనాడు క్విట్‌ ఇండియా ఉద్యమం ద్వారా బ్రిటిష్‌ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి స్వాతంత్య్రాన్ని సాధించుకున్నామని ఆస్ఫూర్తితో భూ రక్షణకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధం కావాలని వెంకట్‌ పిలుపునిచ్చారు. ఆగస్టు 13న క్విట్‌ కార్పొరేట్‌- సేవ్‌ కంట్రీ, సేవ్‌ ల్యాండ్స్‌, సేవ్‌ పూర్‌ పీపుల్‌ను జయప్రదం చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -