నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని నాగపూర్, కమ్మర్ పల్లి గ్రామాల్లో శుక్రవారం పనుల జాతరలో భాగంగా ఇంకుడు గుంతలకు ముగ్గులు పోసే కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పొందిన, నూతనంగా కట్టుకున్న గృహాల లబ్ధిదారుల ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతకు ముగ్గులు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని ఇంకుడు గుంతలకు ముగ్గులు పోసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షపు నీటిని ఆదా చేసి, భవిష్యత్తులో నీటి ఇబ్బందులు లేకుండా చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంకుడు గుంతల నిర్మాణం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు.నూతనంగా గృహాలు నిర్మించుకునే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత ఉండేలా చూసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్, మండల పంచాయతీ అధికారి సదాశివ్, పంచాయతీ కార్యదర్శులు సంధ్య, గంగాజమున, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
పనుల జాతరలో ఇంకుడు గుంతలకు ముగ్గులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES