నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండల కేంద్రంలో సోమవారం రెండో విడతలో భాగంగా మంజూరైన ముగ్గురు లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముగ్గులు పోసే కార్యక్రమాన్ని నిర్వహించారు.కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారుల చేత భూమి పూజ చేయించి, ముగ్గులు పోయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందించడం జరుగుతుందన్నారు.
ఇండ్లు రాలేదని ప్రజలు ఇవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విడతలవారీగా అర్హులకు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందుతాయని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పేదల సొంతింటి కలలు నిజం చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంగాజమున, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సల్లూరి గణేష్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు నిమ్మ రాజేంద్రప్రసాద్, సింగిరెడ్డి శేఖర్, పాలెపు రాజేశ్వర్, మారయ్య, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.