Saturday, November 8, 2025
E-PAPER
Homeక్రైమ్రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

- Advertisement -

– మనవడి మృతిని తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత
– జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఘటన
నవతెలంగాణ-భూపాలపల్లి టౌన్‌/గోవిందరావుపేట

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. గోవిందరావుపేటలో జరిగిన ప్రమాదంలో యువకుడు మృతిచెందగా.. అతని మృతిని తట్టుకోలేక నాయనమ్మ ప్రాణాలు వదిలిన ఘటన శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో జిల్లా కేంద్రంలోని బాబుసింగ్‌పల్లికి చెందిన మామ, అల్లుడు కోడేపాక నరసయ్య(50), కోవల సంజీవ్‌ (35) గణేష్‌చౌక్‌ నుంచి బాంబులగడ్డ వైపు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు టాటా ఏసీ వాహనాన్ని ఢకొీనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి చెందిన కొప్పనాతి వీరబాబు ప్రథమ కుమారుడు హర్ష సాయి (4) గురువారం సాయంత్రం గోవిందరావుపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ కింద పడి మృతిచెందాడు. ఆ దుర్ఘటనను జీర్ణించుకోలేక హర్షసాయి నాయనమ్మ నీలమ్మ శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై కన్నుమూశారు. ఒకే కుటుంబంలో వరుసగా చోటుచేసుకున్న ఈ విషాదకర సంఘటనలతో బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -