నవతెలంగాణ – రెంజల్
విద్యుత్ వినియోగదారులకు నిరంతరంగా కరెంటు సప్లై చేయడానికి రెంజల్ 33/11 కే.వి సబ్ స్టేషన్ లో 30 లక్షల రూపాయల అంచనా వేయంతో మూడు కొత్త బ్రేకర్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్ ఈ రవీందర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 108 కొత్త బ్రేకర్ లు మంజూరు కాగా, రెంజల్ సబ్ స్టేషన్ కు మూడు బ్రేకర్లను ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
సమ్మర్ యాక్షన్ లో భాగంగా ఓవర్ లోడ్ తలెత్తకుండా పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వ్యవసాయదారులకు విద్యుత్ అంతరాయం రాకుండా ఓవర్ లోడ్లను గుర్తించ మన్నారు. మూడు కోట్ల అంచనా వ్యయంతో నాణ్యమైన కరెంటు ఇవ్వాలన్న తలంపుతో జిల్లాలో మూడు సబ్ స్టేషన్లను ప్రారంభించడం జరిగిందన్నారు. వీటి నిర్మాణానికి 6 కోట్ల 30 లక్షల రూపాయలు వ్యయంతో నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి అన్నారు.
విద్యుత్ వినియోగదారులకు ఏలాంటి సమస్యలు ఎదురైన 1912 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేస్తే వారు రికార్డ్ చేసుకుంటారని, వెంటనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. జిల్లాలో సుమారు 40 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని, 15 కోట్ల రూపాయలు ప్రయివేటు, 25 కోట్ల రూపాయల ప్రభుత్వం పరంగా బకాయిలు ఉండగా, విద్యుత్ వినియోగదారులు తమ బకాయిల ను వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. విద్యుత్ బకాయిలు చెల్లించని వినియోగదారుల కరెంటు నిలిపివేత జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ రవీందర్ (ఆపరేషన్) మహమ్మద్ ముక్తార్ (డి ఈ ఈ ఆపరేషన్ బోధన్) నియోజకవర్గం డి ఈ ఈ వెంకటరమణ, ఏ డి ఈ తోట రాజశేఖర్, ఏ ఈ రెంజల్ ముగ్ధూమ్, ఎస్బిఈ ఎండి ఆజార్, విద్యుత్తు సబ్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.