Tuesday, October 28, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు

ఢిల్లీ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఢిల్లీ హైకోర్టులో మంగళవారం ముగ్గురు కొత్త జడ్జీలు జస్టిస్‌ దినేష్‌ మెహతా, జస్టిస్‌ అవనీష్‌ జింగాన్‌, జస్టిస్‌ చంద్రశేఖరన్‌ సుధలు ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్‌ ఉపాధ్యాయ వారితో ప్రమాణం చేయించారు. జస్టీస్‌ మెహతా, జస్టిస్‌ జింగాన్‌లు రాజస్థాన్‌ హైకోర్టు నుండి ఢిల్లీకి బదిలీ కాగా, జస్టిస్‌ సుధ కేరళ హైకోర్టు నుండి బదిలీ అయ్యారు. అంతకు ముందు, ఆరుగురు జడ్జీలు జస్టీస్‌ వి.కామేశ్వరరావు, జస్టీస్‌ నితిన్‌ వాసుదేవ్‌ సాంబ్రే, జస్టిస్‌ వివేక్‌ చౌదరి, జస్టిస్‌ ఓం ప్రకాష్‌ శుక్లా, జస్టిస్‌ అనిల్‌ క్షేత్రర్పాల్‌ మరియు జస్టిస్‌ అరుణ్‌కుమార్‌ మోంగాలు ఇతర రాష్ట్రాల హైకోర్టుల నుండి ఢిల్లీకి బదిలీ అయిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -