Saturday, August 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంచేపల వేటకు వెళ్లి ముగ్గురు గల్లంతు

చేపల వేటకు వెళ్లి ముగ్గురు గల్లంతు

- Advertisement -

– ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలోని కట్టలేరులో ఘటన
నవతెలంగాణ-ఎర్రుపాలెం

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బంజర గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కట్టలేరులో చేపలవేటకు వెళ్లి గురువారం గల్లంతయ్యారు. తహసీల్దార్‌ ఉషాశారద తెలిపిన వివరాల ప్రకారం.. బంజర గ్రామానికి చెందిన బాదవత్‌ రాజు(55), భూక్యా కోటి (46), భూక్య సాయి (25) కట్టలేరుకు చేపలు పట్టేందుకు వెళ్లారు. ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కట్టలేరు వద్దకు వెళ్లి చూడగా ఆచూకీ లభ్యం కాలేదు. దాంతో వారు పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. తహసీల్దార్‌ ఉషాశారద, మధిర సీఐ మధు, ఎర్రుపాలెం ఎస్‌ఐ రమేష్‌ కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెవెన్యూ, పోలీస్‌ సిబ్బంది సమాచారంతో ఖమ్మం నుంచి ఎప్డీఎఫ్‌ఆర్‌ బృందాలను పిలిపించి సహాయక చర్యలు చేపడుతున్నారు. రాత్రి వరకూ ఆచూకీ లభ్యం కాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -