Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeసినిమాథ్రిల్‌ చేసే 'c-మంతం'

థ్రిల్‌ చేసే ‘c-మంతం’

- Advertisement -


టీఅర్‌ డ్రీమ్‌ ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘c-మంతం’. ఈ చిత్రం నుంచి గ్లింప్స్‌ను మేకర్స్‌ శనివారం రిలీజ్‌ చేశారు. ఈ గ్లింప్స్‌ ఇప్పటికే సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. క్లాసిక్‌ థ్రిల్‌, ఎమోషనల్‌ డెప్త్‌ కలగలిసినట్లుగా కనిపించిన ఈ గ్లింప్స్‌లో విజువల్స్‌, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ముఖ్యంగా ఓ ప్రెగెంట్‌ మహిళ చేతులు వెనక్కి కట్టిన దశ్యం, రక్తపు మడుగులు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే చర్యలతో.. దర్శకుడు సుధాకర్‌ పాణి ఈ సినిమాను కొత్తగా చూపించడానికి ప్రయత్నించినట్టు గ్లింప్స్‌ ద్వారా తెలుస్తోంది.

సంగీత దర్శకుడు ఎస్‌.సుహాస్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ గ్లింప్స్‌కు బలాన్ని చేకూర్చింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది.
‘ఇప్పటి వరకు ఎన్నో సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలొచ్చి ప్రేక్షకుల్ని అలరించాయి. వాటితో పోలిస్తే చాలా వైవిధ్యంగా ఉంటూ అనుక్షణం ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసేలా మా చిత్రం ఉంటుంది. ఈ సినిమా సక్సెస్‌ సాధిస్తుంది’ అని మేకర్స్‌ చెప్పారు.
వజ్రయోగి, శ్రేయ భర్తీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్‌ : సుధాకర్‌ పాణి, ప్రొడ్యూసర్‌: ప్రశాంత్‌ టాటా, సహ నిర్మాత: గాయత్రీ సౌమ్య గుడిసెవా, డీఓపీ : శ్రీనివాస్‌ విన్నకోట, ఎడిటర్‌: అమర్‌ రెడ్డి, మ్యూజిక్‌: ఎస్‌.సుహాస్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ : వీరవల్లి మురళి కష్ణ, ఫైట్‌ మాస్టర్స్‌: రామకష్ణ, వెంకట్‌, కొరియోగ్రాఫర్‌ : దుర్గేష్‌.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img