ప్రభుత్వ ఉపాధ్యాయులు ముందుకు రావడం అభినందనీయం: ఎంఈఓ రాందాస్
నవతెలంగాణ – నెల్లికుదురు
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉపాధ్యాయులు తమ సొంత ఖర్చులతో టై బెల్టు బ్యాడ్జీలను అందివ్వడం అభినందనీయమని మండల విద్యాశాఖ అధికారి ఏ రాందాస్ అన్నారు. మండలంలోని టీక్యా తండా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న శంషుద్దీన్ సురేష్ రెడ్డి ఉపాధ్యాయులు తమ సొంత ఖర్చులతో అందజేసిన టైప్ బెల్ట్ బ్యాడ్జీలను శుక్రవారం మునిగలవీడు జడ్పీహెచ్ఎస్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు స్వప్నతో కలిసి విద్యార్థులకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ .. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించే దిశగా ప్రయత్నించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు టై, బెల్టులు పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES