- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని ఇందన్పల్లి రేంజ్ ఇందనపల్లి (N)బీట్ లో ఒక ఆవుని పులి చంపినట్లు ఇందన్ పల్లి ఎఫ్ ఆర్ ఓ లక్ష్మీనారాయణ తెలిపారు. అదేవిధంగా సమీపంలోని గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒకరు, ఇద్దరు తిరుగవద్దని, పశువుల కాపరులు అడవిలోకి వెళ్లవద్దని, ప్రజలు భయబ్రాంతులకు గురి కావద్దని తెలిపారు. వేట కోసం కరెంటు వైర్లు, ఉచ్చులు, ఊర్లు పెట్టితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆవు యొక్క యజమానికి నష్ట పరిహారం చెల్లిస్తామని తెలిపారు. పులిపై ఎలాంటి సమాచారం ఉన్న అటవీ అధికారులకు తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓ రవి అటవీ అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -



