Monday, July 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాగులమ్మ అటవీప్రాంతంలో పులి సంచారం.?

నాగులమ్మ అటవీప్రాంతంలో పులి సంచారం.?

- Advertisement -

పులి కాదు, హైనా అంటున్న పారెస్ట్ అధికారులు
భయాందోళనలో ప్రయాణికులు
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని కొయ్యూరు-నాగులమ్మ ఆటవీ పరిసరప్రాంతాల్లో ఆదివారం పులి పాదముద్రలు గుర్తించి పలువురు పెద్దపులిగా అనుమానం వ్యక్తం చేస్తూ భయాందోళనకు గురైయ్యారు.ఈ ప్రచారం పాస్ట్ గా కొయ్యుర్ ప్రధాన రహదారిపై నుంచి నాగులమ్మ మీదుగా తాడిచర్ల,మల్లారం,పెద్దతూoడ్ల,చిన్నతూoడ్ల  గ్రామాల ప్రజలకు,ప్రయాణికులకు చేరడంతో వారు భయాందోళన చెందారు.పాదముద్రలను పరిశీలించిన అటవీశాఖ అదికారులు పెద్దపులి కాదు హైన (కొండ్రిగాడు) అనే ఓ జంతువు పాదముద్రలని స్పష్టం చేశారు.పెద్దపులి గత మూడు వారాల క్రితం సంచరించిన విషయం వాస్తవమే కానీ అది ఇప్పుడు ఈ అడవిలో ఉన్నట్లు ఆనవాలు ఎక్కడ కనిపించడం లేదన్నారు. హైనా అనే జంతువు సంచరించడం పెద్దపులి పాదాలకు దగ్గర పోలికలతో జంతు పాదముద్రలు ఉండడం ఆసక్తికరమైన విషయంగా మారిందన్నారు.ప్రయాణికులు,ప్రజలెవ్వరు భయపడాల్సిన అవసరం లేదన్నారు.అది హైనాని ప్రజలకు ఎలాంటి హాని కలిగించే జంతువు కాదన్నారు.అయినా ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -