నవతెలంగాణ – మునిపల్లి:
ఈనెల 14వ తేదీ నుండి జరిగే పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు మునిపల్లి మండల విద్యాధికారి భీంసింగ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ మునిపల్లి మండలంలో మొత్తం నాలుగు కేంద్రాలలో 554 మంది పదవ తరగతి విద్యార్థులు పరీక్ష రాస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మండలంలోని కంకోలు పరీక్ష కేంద్రంలో 130 మంది విద్యార్థులు, బుదేరా పరీక్ష కేంద్రంలో 128 మంది విద్యార్థులు, మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఒక 183 మంది విద్యార్థులు, పెద్దచెల్మడ పరీక్ష కేంద్రంలో 113 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నట్టు ఆయన వివరించారు. పదవ తరగతి పరీక్షలు ఈనెల 14వ తేదీతో ప్రారంభమై ఏప్రిల్ 13వ తేదీ వరకు నిర్వహించబడతాయని మండల విద్యాధికారి స్పష్టం చేశారు.పరీక్ష కేంద్రాల వద్ద నలుగురు చీప్ సూపరింటిం డెంట్ లతో పాటు పటిష్టమైన భద్రత కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు.



