శోభయాత్రలో 1300 మంది సిబ్బందితో భారీ ఏర్పాట్లు
శోభయాత్ర దారి పొడవున పటిష్టమైన నిఘా వ్యవస్థ
డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ, 200 సి.సి కెమెరాలతో ఏర్పాట్లు
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నవతెలంగాణ – కంటేశ్వర్
గణేష్ శోభయాత్ర కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామని,శోభయాత్రలో 1300 మంది సిబ్బంది,శోభయాత్ర దారి పొడవున పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామని, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ, 200 సి.సి కెమెరాలతో ఏర్పాట్లు చేశామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ లలోని అన్ని గణేష్ నిమజ్జనోత్సం శోభయాత్ర సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు.
గణేష్ నిమజ్జనోత్సవ శోభయాత్ర శాంతియుతంగా సజావుగా నిర్వహించేదుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, అన్ని డివిజన్ పరిధిలలో ప్రధాన నిమజ్జన మార్గాల్లో దాదాపు 1300 మందికి పైగా పోలీస్ సిబ్బందిని నియమించామని, సి.సి కెమెరాల ద్వారా నిఘా డ్రోన్ కెమెరాలలతోపర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాట్లు పోలీస్ సిబ్బందితో పాటు ఎక్సైజ్ శాఖ, ఫారెస్టు శాఖ, ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్ మొదలగు వారితో బందోబస్తు ఏర్పాటు చేసామన్నారు.
గణేష్ నిమజ్జనం నిర్వాహకులుశోభయాత్రలో తప్పనిసరి పాటించవలసిన పలు సూచనలు సిపి విడుదల చేశారు. నిమజ్జన ఊరేగింపులో శాంతియుతంగా పాల్గొనాలని,అనుమానస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వలని,ట్రాఫిక్ నియమాలు అందరూ పాటించాలని,ఆడియో సిస్టమ్స్ నిర్ణీత స్థాయిలో ఉపయోగించాలని,డి.జేలు పూర్తిగా నిషేదం,ఎటువంటి రూమర్స్ ( పుకార్ల) ను నమ్మరాదు.
మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనడం తప్పు వారిపై కఠిన చర్యలు తీసుకోబడును. నిమజ్జన సమయంలో అత్యవసర సమయంలో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు..
100 డయల్, పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 87126-59700, సంబంధిత పోలీస్ స్టేషన్ వారిని సంప్రదించగలరు. ప్రజలందరూ ఈ గణేష్ శోభయాత్రను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలియజేశారు.