Saturday, December 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెండవ విడత జీపీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు: సీపీ

రెండవ విడత జీపీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు: సీపీ

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య శాంతియుత వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు అన్ని రకాల పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండవ విడత నిజామాబాదు డివిజన్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు గలవు. ఇట్టి సబ్ డివిజన్ పరిధిలో 8 మండలాలలో 162 గ్రామపంచాయతీలు , 1114 వార్డులలో , 2,40,715 మంది ఓటర్లు గలరు.ఈ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ శాఖ పరంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది ఇందుకుగాను సబ్ డివిజన్ పరిధిలోని ఎన్నికలు నిర్వహించే ప్రాంతాలలో  రెండు చెక్ పోస్ట్ లను ( యంచ , ఇందల్ వాయ్ ) ఏర్పాటు చేసి నిర్విరామముగా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి 24 / 7 వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది.

 59 సమస్యత్మక ప్రాంతాలలో పటిష్ట మైన నిఘా వ్యవస్థ ఏర్పాట్లు చేయడం జరిగింది.  31 ఎఫ్.ఎస్.టీ టీమ్స్ , 6 ఎస్. ఎస్. టీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. లిక్కర్ మొత్తం 4 కేసుల లో 166.33 లీటర్లు సీజీ చేయడం జరిగింది, వాటి విలువ దాదాపు 97,490/- గలదు. నిజామాబాదు డివిజన్ పరిధిలో బైండోవర్ లు మొత్తము 308 మందిని సంబంధిత తహసీల్దారుల ముందు హాజరు పరిచి బైండోవర్ చేయడం జరిగింది.నిజామాబాదు డివిజన్ పరిధిలో ఈ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమా నియమావళిని ఉల్లంఘించినటువంటి వారిపై 1 కేసు నమోదు చేయడం జరిగింది. సిరికొండ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేయడం జరిగింది.ఈ నేపథ్యంలో సబ్ డివిజన్ పరిధిలోని మొత్తం 11 మంది వద్ద గన్ లైసెన్లు కలిగినటువంటి వారిని డిపాజిట్ చేయమని తెలియజేయగా 10 డిపాజిట్ చేయడం జరిగింది.

మిగతా 1 గన్ లైసెన్సులు బ్యాంకుకు సంబంధించినది గలవు.ఎవ్వరు కూడా ఎలాంటి అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించరాదు, ఎవరైనా అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించి నట్లయితే వారిపై 163 బి.ఎన్.ఎస్.ఎస్,. చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది.మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ర్యాలీలు నిర్వహించిన ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టానాకలన్ గ్రామంలో ఇద్దరిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు ఎక్కడ ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తగా పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 1120 మందిని సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -