Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మూడో విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ

మూడో విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి     
జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు బాన్స్‌ వాడ, నస్రుల్లాబాద్, బీర్కూర్, మద్నూర్, డోంగ్లీ, బిచ్కుంద, జుక్కల్, పెద్ద కోడపగల్ మండలాలలో జరగనున్న సందర్భంగా, ఎన్నికలు పూర్తిగా శాంతియుతంగా, నిష్పక్షపాతంగా పోలింగ్, ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా జిల్లా పోలీసు శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర ఐపిఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ఐదు అంచెల భద్రతా వ్యవస్థలో మొత్తం 812 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 02 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు, 03 అంతర్‌జిల్లా చెక్‌పోస్టులు, 25 ఎఫ్ ఎస్ టి  బృందాలు, 05 ఎస్ ఎస్ టి  బృందాల ద్వారా నిరంతర వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుతో పాటు, అదనంగా 37 రూట్ మొబైల్ పార్టీలు, 08 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు, 03 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు మోహరించామని తెలిపారు. మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలలోని 10 క్రిటికల్ మరియు 9 సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రచారం, అడ్డంకులు, ఉద్రేకం లేదా ప్రలోభాలు సృష్టించడం పూర్తిగా నిషేధమని తెలిపారు. ఓటర్లు పోలింగ్ కేంద్రంలోనికి ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డు మాత్రమే తీసుకురావాలని సూచించారు. అలాగే 100 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇంక్ బాటిల్స్, ఇంక్ పెన్స్, అగ్గిపెట్టెలు, వాటర్ బాటిళ్లు, కత్తులు తీసుకురావడం నిషేధమన్నారు. నేర చరిత్ర కలిగిన 211 మందిపై బైండోవర్, ఎన్నికల నియమావళి పరిదికి మించి తీసుకెళ్తున్న రూ.10,89,000 నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.  ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 18 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -