నవతెలంగాణ – చేవెళ్ల: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగేఅవకాశం ఉంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మూడు జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు.

మృతుల్లో 15 నెలల చిన్నారి కూడా ఉంది. తల్లి, బిడ్డ మృతదేహాలను రోడ్డుపై ఉంచిన దృశ్యం హృదయవిదారకంగా ఉంది. ప్రమాదానికి టిప్పర్ అతివేగమే కారణమని సమాచారం. ఘటనా స్థలంలో ప్రయాణికుల ఆర్తనాదాలతో భీతావహ వాతావరణం నెలకొంది.



