యు ముంబపై గెలుపుతో పై పైకి..
విశాఖపట్నం: ప్రొ కబడ్డీ సీజన్-12లో తెలుగు టైటాన్స్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకొని హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తోంది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ … పాయింట్ల తేడాతో యు ముంబను చిత్తుచేసింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి తెలుగు టైటాన్స్ 27-11 పాయింట్ల ఆధిక్యతలో నిలిచిన టైటాన్స్.. రెండో అర్ధభాగంలోనూ ధాటిగానే ఆడింది. రెండో అర్ధభాగంలో యు ముంబ పుంజుకొనేందుకు ప్రయత్నించినా.. నిర్ణీత సమయం ముగిసేసరికి టైటాన్స్ జట్టు 45-37పాయింట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో టైటాన్స్ వరుసగా మూడో గెలుపుతో 3వ స్థానానికి ఎగబాకింది. టైటాన్స్ ఆల్‌రౌండర్ భరత్(13), చేతన్(6)కి తోడు కెప్టెన్ విజరు మాలిక్(5) రైడ్‌లలో రాణించారు.