– వ్యవసాయ శాఖ అధికారికి ఏఈల సమస్యలపై వినతి పత్రం అందజేత
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లాలో టీఎన్జీవో ఆధ్వర్యంలో నిన్న గుండెపోటుతో అకాల మరణం చెందిన ఏ ఈ ఓ బస్వరాజు ఆత్మకు శాంతి చేకూరాలని కలెక్టర్ కార్యాలయం ముందు, డిఏఓ కార్యాలయం లో మౌనం పాటించారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి కి వినతి పత్రాన్ని అందజేసినట్లు పిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఏఈవోలు పడుతున్న ఇబ్బందులు, అదేవిధంగా రైతు వేదిక మెయింటనెన్స్, రైతు వేదికకు అటెండర్స్, లాప్టాప్స్, డాటాఎంట్రీ ఆపరేటర్లను నియమించాలని, క్షేత్ర స్థాయిలో పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. అందరూ కలిసి సమిష్టిగా కలెక్టర్ కు వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు. శుక్రవారం మృతి చెందిన ఏఈఓ కుటుంబములోనీ భార్యకి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం ఉపాధి కల్పించి ఆర్థిక సాయం చేయాలని కోరడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు కార్యదర్శి నాగరాజు, కోశాధికారి దేవరాజు, జిల్లా గౌరవ అధ్యక్షులు చక్రధర్, ఏఈవో సంఘం జిల్లా నాయకులు శ్రావణ్ కుమార్, రాకేష్, శ్రీనివాస్ రెడ్డి, దయానంద్, బానోత్ శ్రీనివాస్, ముఖిద్, రాజా గౌడ్, రవీందర్, భూపాల్ సంతోష్, రేణుక, శ్రీలక్ష్మి, మీనా మరియు జిల్లాలోని 104 క్లస్టర్ లకు సంబంధించిన ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.