Friday, January 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన టీఎన్‌జీఓ నేతలు

మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన టీఎన్‌జీఓ నేతలు

- Advertisement -

పర్యావరణం, ఇంధన ఆదాపై
ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం
నవతెలంగాణ – దిల్‌సుఖ్‌నగర్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, ఇంధనం ఆదా, స్థిరమైన రవాణా విధానాల దిశగా తీసుకున్న నిర్ణయాలు అభినందనీయమని టీఎన్‌జీఓ నేతలు హర్షం వ్యక్తం చేశారు. టీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం ముజీబ్‌ హుస్సేని, సహాధ్యక్షులు కస్తూరి వెంకట్‌, కోశాధికారి ఎం.సత్యనారాయణగౌడ్‌, ఉపాధ్యక్షులు చిలుక నర్సింహారెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గ్యాదరి పరమేశ్వర్‌ బుధవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుపై 20 శాతం రాయితీ ప్రకటించడం దూరదృష్టి గల ప్రజాహిత నిర్ణయం అన్నారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగానికి మరింత ప్రోత్సాహం పొందడమే కాకుండా, వాయు కాలుష్య నియంత్రణ, కార్బన్‌ ఉద్గారాల తగ్గింపు, పర్యావరణ పరిరక్షణకు గణనీయమైన తోడ్పాటు అందుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ మొబిలిటీ విధానాల విస్తరణకు ఈ నిర్ణయం కీలకంగా నిలుస్తుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్‌ వాహనాలపై 20 శాతం రాయితీ కల్పించినందుకు సీఎం రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గానికి ప్రభుత్వ ఉద్యోగులందరి తరపున వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సదావకాశాన్ని ఉద్యోగులందరూ వినియోగించుకొని రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా మార్చాలని, ఈ మార్పునకు రాష్ట్ర ఉద్యోగులు తోడ్పడాలని టీఎన్‌జీఓ నాయకులు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -