Tuesday, April 21, 2026
E-PAPER
Homeకవితమహిళా మణులందరికి…

మహిళా మణులందరికి…

- Advertisement -

ప్రేమించే నీవు లేని జీవితం ఏమి జీవితం అనేది వనితే కదా
నీవుంటేనేగ నా జీవితం వెన్నెల వాగౌననేది మహిళే కదా
ప్రేమలో ప్రేమగ తరువులా పల్లవిస్తూ పలవించు ప్రస్తావనై
స్నేహసౌహార్ద్ర చిలకరింపుల పులకరింపుల వెలుగునది వాశితే కదా
గెలుపుల గొలుసౌతూ ఓటముల గోడౌతూ చంద్ర కళలకే నెలవౌతూ
తాను ఎవరు ఎరుగనట్టి అక్షర వాహిని కలితన
మనేది కలికే కదా
రుతువులు అన్నీ కలకలిసి మెరిసే ఓ అందచందాల రుతువై పోతూ
వెన్నెల సారమై పూదేనె పూరమై రేయిని
వెలిగేది లలితే కదా
ఎన్ని మచ్చుల కచ్చల చిచ్చుల ఉచ్చుల తర తరములలో తరుముతు ఉన్నా
ఎద కురిసే ఓడిపోని పోడిమితో వలపు ప్రేరణయేది సకియే కదా
పున్నమి రేయిలోన విచ్చుకునే పొన్నల పరిమళరాగమై పలుకరిస్తూ
చేతనతొ చెలిమితొ సేవలెన్ని చేసినా అబ లనబడేది అతివే కదా
మల్లీ! విశ్వహితా వల్లరై
మౌన సంభాషణాభాషా మాధురై
మెరుపు తీగె విరుపై కవిత్వమై కవ్వించే కాంత వెలుగు భవితే కదా

రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -