బాపుబొమ్మగా తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకుని, సామాజిక – రాజకీయ రంగాల్లోనూ తన ప్రత్యేకత చాటుకుంటున్న నటీమణి దివ్యవాణి చౌదరి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘బాపు బొమ్మ – విశ్వ మహిళ’ పేరిట 2026వ సంవత్సరానికిగాను అవార్డ్స్ ప్రదానం చేశారు. కొణిదెల అంజనీదేవి, కృష్ణంరాజు సతీమణి శ్రీమతి శ్యామలాదేవి, యాంకర్ స్వప్న, జనేతా కంచర్ల (యు.ఎస్.ఎ), డాక్టర్ వెన్నెల గద్దర్, డాక్టర్ పద్మజా చంద్రకాంత్, సమీరా భరద్వాజ్, రేఖారాణి, డి. జ్యోతిరెడ్డి (యు.ఎస్.ఎ) తదితర ప్రముఖ మహిళామణులు పురస్కారాలు అందుకున్నవారిలో ఉన్నారు.
తెలంగాణ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సౌజన్యంతో హైదరాబాద్, దసపల్లా హోటల్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ”తెలుగు వన్” అధినేత కంఠంనేని రవిశంకర్, నటుడు – రచయిత హర్షవర్ధన్, డిప్యూటీ కలెక్టర్ ఇ.వెంకటాచారి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎమ్.కిరణ్ కుమార్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. మహిళల్లో స్ఫూర్తి నింపడం కోసం దివ్య వాణి ‘బాపు బొమ్మ- విశ్వ మహిళ’ పేరుతో ప్రారంభించిన ఈ ప్రతిష్టాత్మక పురస్కారం.. మెగా మాతమూర్తి కొణిదెల అంజనీదేవితో శ్రీకారం చుట్టడం అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు.
మహిళల్లో స్ఫూర్తి నింపడం కోసం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



