Tuesday, July 22, 2025
E-PAPER
Homeమానవిఫ్రెష్‌గా ఉండాలంటే...

ఫ్రెష్‌గా ఉండాలంటే…

- Advertisement -

ఆకుకూరలు పోషకాల పవర్‌హౌస్‌. తోటకూర, పాలకూర, మెంతి, బచ్చలి, గోంగూర.. లాంటి ఆకుకూరల్లో పొటాషియం, మెగ్నీషియం, సోడియం, కాల్షియం, ఐరన్‌, ఫోలేట్‌, ప్రొటీన్లు, విటమిన్లు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. చాలామంది వారానికి సరిపడా ఆకుకూర ఒకేసారి కొనుక్కుంటూ ఉంటారు. అయితే, కొన్ని సార్లు ఫ్రిజ్‌లో పెట్టినా.. పాడవుతూ ఉంటాయి. కొన్ని సింపుల్‌ టిప్స్‌ ఫాలో అయితే, ఆకుకూరలను ఎక్కువ రోజులు స్టోర్‌ చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం.?
టవల్‌లో చుట్టండి..

ఆకుకూరలు త్వరగా పాడవ్వడానికి ముఖ్యమైన కారణం.. అధిక తేమ. వీటిని స్టోర్‌ చేసుకోవడానికి, ముందుగా ఆకులు పొడిగా ఉండేలా చూసుకోవాలి. దెబ్బతిన్న, చెడిపోయిన ఆకులను క్లీన్‌ చేయాలి. ఆ తర్వాత శుభ్రమైన క్లాత్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేస్తే.. ఆకుకూరలు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
న్యూస్‌ పేపర్‌ వాడండి..
ముందుగా వాటిలోని చెడిపోయిన ఆకులను తీసివేయాలి. ఆ తర్వాత, కాడలు కత్తిరించాలి. వీటిని న్యూస్‌ పేపర్‌లో పెట్టి రోల్‌ చేయాలి. ఈ రోల్‌ను జిప్‌-లాక్‌ బ్యాగ్‌లో పెట్టి ఫ్రిజ్‌లో స్టోర్‌ చేస్తే వారం వరకూ ఫ్రెష్‌గా ఉంటాయి.
ఎయిర్‌ టైట్‌ కంటైనర్‌లో స్టోర్‌ చేయండి..
ఆకు కూరలను ఎయిర్‌ టైట్‌ కంటైనర్‌లో మస్లిన్‌ క్లాత్‌ వేసి ఉంచాలి. ఆ తర్వాత వాటిని డబ్బాలో పెట్టాలి. ఇలా చేస్తే ఆకుకూరలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -