ఎర్రవెల్లిలో కేసీఆర్ కీలక సమావేశం
ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు, మాజీ ఎంపీ వినోద్ హాజరు
కరీంనగర్ బీసీ గర్జన సభ ఏర్పాట్లపై చర్చ
బీజేపీలో విలీనం, ఫిరాయింపు ఎమ్మెల్యేలపైనా మరోసారి ఢిల్లీకి..
నవతెలంగాణ-మర్కుక్
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామ శివారులోని తమ వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. పార్టీ ముఖ్యనేతలతో సోమవారం భేటీ అయ్యారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై చర్చించినట్టు సమాచారం. రెండు రోజుల క్రితం భేటీ అయిన సమయంలో కాళేశ్వరంపై పూర్తిస్థాయిలో చర్చించలేదు. కాళేశ్వరంపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ నివేదిక బయటకు వచ్చిన విషయం తెలిసిందే. మంత్రివర్గం కూడా దీనిపై చర్చించింది. తదు పరి చర్యలు ఏమిటనేది ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ జరిపిన సమావేశంలో కాళేళ్వరం నివేదికపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే, ఈనెల 14న కరీంనగర్‌లో నిర్వహించే బీసీ గర్జన సభపై చర్చించినట్టు సమాచారం. బీసీలకు రిజర్వేషన్ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానాస్త్రంగా తీసుకున్న నేపథ్యంలో ఈ అంశంలో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని బీఆర్‌ఎస్ బీసీ సభకు ప్లాన్ చేస్తోంది. నిజానికి ఈనెల 8వ తేదీనే ఈ సభ జరపాలనుకున్నప్పటికీ వర్షాల కారణంగా 14వ తేదీకి మార్చుతూ పార్టీ నిర్ణయం తీసుకుంది. వర్షాల నేపథ్యంలో సభ పెట్టడం సాధ్యమవుతుందా అన్న చర్చా జరిగింది. కాగా, ఢిల్లీ కేంద్రంగానే బీఆర్‌ఎస్ రాజకీయాలు నడుపనున్నట్టు సమాచారం.
కాళేశ్వరం నివేదికపై సుప్రీంకు..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES