Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పొగాకు బాలల భవితకు ముప్పు: డా.హిప్నో పద్మా కమలాకర్

పొగాకు బాలల భవితకు ముప్పు: డా.హిప్నో పద్మా కమలాకర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పొగాకు బాలల భవితకు ముప్పు ఏర్పడుతుందని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్, లయన్ జయశ్రీ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పిలుపు మేరకు మే 31వ తేదీని ప్రపంచ పొగాకు రహిత దినోత్సవంగా సందర్భంగా డా. హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్, నవభారత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రామకృష్ణ మఠం బాలల సేవా విభాగం లో డ్రాయింగ్, వ్యాస రచన పోటీలో గెలుపొందిన దీపిక, రీషీ, ఆయుర్వేద , జగదీశ్వర కి డా.హిప్నో పద్మా కమలాకర్, లయన్స్ జయశ్రీ, జి.కృష్ణవేణీ, జ్యోతి రాజా, బాలల సేవా విభాగం హెడ్ ఆరతి, సినియర్ అడ్వకేట్ ఎస్. వెంకటేశ్వర్లు బహుమతులు, స్టూడెంట్ షాహినా నోట్ పుస్తకాలు, క్రెయాన్స్, పెన్సిల్స్ , పెన్నులు, చాక్లెట్స్ ,ప్రదానం చేశారు.


డా. హిప్నో పద్మ కమలాకర్ మాట్లాడుతూ..“పిల్లలు తక్కువ వయసులో పొగాకు వంటి వ్యసనాలను అలవాటు చేసుకుంటున్నారన్నారు. దాని వల్ల వారి భవితవ్యం అంధకారంలోకి నెట్టబడుతుందన్నారు. వారిని ప్రేమతో, అవగాహనతో రక్షించాలని తెలిపారు. ఈ బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు . పొగాకు వల్ల రోగనిరోధక శక్తి బలహీనమవుతుందన్నారు. చిన్న వయసులోనే గుండెజబ్బులు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇది ఇప్పుడు అకాల మృత్యువులకు ప్రధాన కారణమని తెలిపారు.పొగాకులోని నికోటిన్ మూలంగా ఆందోళన, ఒత్తిడి పెరిగి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గడం జరుగుతోందన్నారు. హెచ్ఐవి, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటి ప్రమాదాలు పొగాకుతో ముడిపడ్డవేనని చెప్పారు. పిల్లలు మొదటి సారిగా పొగాకు ఉత్పత్తులను ఆసక్తితో లేదా చుట్టుపక్కల వాతావరణ ప్రభావంతో ప్రయత్నిస్తారన్నారు. కానీ వారికీ దీని హానికరమైన ప్రభావాలు తెలియక, అది అలవాటుగా మారి చివరకు ప్రాణాంతక వ్యసనంగా మారుతుందని తెలిపారు . చిన్న చిన్న టెక్నిక్స్ సాధన చేస్తే వాటి బారి పడకుండా కాపాడుకోవచ్చని వారికి నేర్పించారు.

లయన్ జయశ్రీ మాట్లాడుతూ ఇప్పటి కాలంలో చిన్న పిల్లలు, యువత పొగాకు ఉత్పత్తులవైపు పయనిస్తూ తమ జీవితాలను స్వయంగా నాశనం చేసుకుంటున్నారన్నారు. ముఖ్యంగా పాన్ మసాలా, గుట్కా, సిగరెట్, ఈ-సిగరెట్ లాంటి పదార్థాలు శరీర ఆరోగ్యాన్ని మానసిక స్థిరత్వాన్ని దెబ్బ తీస్తుంది న్నారు. చిన్న పిల్లలు, యువత పొగాకు ఉత్పత్తులవైపు ఆకర్షితమవుతూ తమ జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నదాని గురించి చైతన్యం కలిగించేలా ఈ పోటీలు నిర్వహించామన్నారు. పిల్లలకు పొగాకు తినడం ఎంత ప్రమాదకరమో తెలుసుకోవడమే కాకుండా, ఆరోగ్యకరమైన జీవనశైలి ఎలా ఉండాలో కూడా తెలియజేయడమే లక్ష్యమన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad