బీపీ, షుగర్, లివర్, కిడ్నీ వ్యాధులు ప్రమాదకరం
గడ్డి మందు ను వెంటనే ప్రభుత్వం నిషేదించాలి
శ్రీ రక్షా హాస్పిటల్ ప్రముఖ వైద్యులు గోంగూర వెంకటేశ్వరరావు
నవతెలంగాణ – బోనకల్
నేడు కోట్లాది రూపాయల ఉంటే సంపదవంతులు కాదని ఆరోగ్యవంతంగా ఉండటమే నిజమైన సంపద అని ఖమ్మం కు చెందిన ప్రముఖ శ్రీరక్ష హాస్పిటల్ యజమాని ప్రముఖ డాక్టర్ గోంగూర వెంకటేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం పరిధిలోనే బోనకల్ మండల పరిధిలోని బోనకల్, ముష్టికుంట్ల గ్రామాలలో శ్రీ రక్ష హాస్పిటల్ ఆధ్వర్యంలో శనివారం ఆరోగ్య యాత్ర నిర్వహించారు. తొలుత బోనకల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 170 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బోనకల్ ముష్టికుంట్ల గ్రామాలలో ఆరోగ్య యాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్యులు గోంగూర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఒకప్పుడు డబ్బు ఉంటే ధనవంతులని భావించారని కానీ నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉన్నవారే ధనవంతులన్నారు. ప్రస్తుత కాలంలో బీపీ, షుగర్, లివర్, కిడ్నీ వ్యాధులు ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. ఈ నాలుగు రోగాల పట్ల ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. శరీరంలో ఎటువంటి మార్పులు వచ్చినా వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్య చికిత్స చేయించుకోవాలని సూచించారు. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అవి ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉందన్నారు. ప్రధానంగా వ్యవసాయానికి ఉపయోగించే గడ్డి మందును ప్రభుత్వం వెంటనే నిషేధం విధించాలని ఆయన కోరారు. ఈ గడ్డి ముందుకి ప్రస్తుతం వైద్యం లేదన్నారు. కుటుంబాలలో కలతలు వచ్చిన సమయంలో కొంతమంది క్షణికావేశంతో ఈ గడ్డి మందు తాగుతున్నారని తెలిపారు.
ఎక్కువగా ఆసుపత్రులకు వచ్చేవారు ఈ గడ్డి మందు తాగిన వారే వస్తుండటం విశేషం. అందువల్ల ప్రభుత్వం మానవజాతికి అత్యంత ప్రమాదకరంగా మారిన గడ్డి మందును నిషేధించాలని ఆయన కోరారు. ప్రజలలో ఆరోగ్య పై చైతన్యం కలిగించేందుకే శ్రీ రక్షా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆరోగ్య యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బోనకల్ ముష్టికుంట్ల సర్పంచులు బానోత్ జ్యోతి, పిల్లలమర్రి నాగేశ్వరరావు, బోనకల్ ఉపసర్పంచ్ బానోతు కొండ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు, సిపిఎం నాయకులు తెల్లాకుల శ్రీనివాసరావు, ఉప్పర శ్రీను, కాంగ్రెస్ నాయకుడు బీపీ నాయక్, బోనకల్ మాజీ సర్పంచ్ భూక్య సైదా నాయక్, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు గుగులోతు రమేష్, మంద పాపారావు, ఆత్మకూరి నాగేశ్వరరావు, బండి వెంకటేశ్వర్లు, మోర్ల శ్రీనివాసరావు, నందమూరి సత్యనారాయణ, మరీదు శేషు, జరుపుల శివకృష్ణ, మరీదు వెంకటేశ్వర్లు, మోర్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ రక్ష హాస్పటలు వైద్యులు గోంగూర వెంకటేశ్వర్లు, షేక్ ఏడుకొండలు, డాక్టర్ సాత్విక్, డాక్టర్ అఖిలేష్, ల్యాబ్ టెక్నీషియన్లు కిరణ్, తరుణ్ వైద్య సిబ్బంది పద్మ, తదితరులు పాల్గొన్నారు.



