Sunday, July 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు లాల్ ద‌ర్వాజ్ బోనాలు

నేడు లాల్ ద‌ర్వాజ్ బోనాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాలను ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు. ఆషాడంలో మొదటిగా గోల్కొండ బోనాలు, రెండోది బల్కంపేట ఏల్లమ్మ బోనాలు, ఆ తరువాత సికింద్రాబాద్‌ ఉజ్జయిని బోనాలు అనంతరం వచ్చే ఆదివారం రోజున లాల్‌దర్వాజ బోనాలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తున్నది. ఈ నేపథ్యంలో నేడు జరిగే లాల్‌దర్వాజ బోనాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మరుసటి రోజు సోమవారం లాల్‌దర్వాజ నుంచి చార్మినార్‌ కేంద్రంగా ఢిల్లీ దర్వాజ వరకు భారీ ఊరేగింపుగా ఘటాల ఉత్సవం కన్నుల పండువగా కొనసాగనున్నది. లక్షలాదిగా భక్తులు తరలిరానుండటంతో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -