Tuesday, December 9, 2025
E-PAPER
Homeజాతీయంనేడు సోనియాగాంధీ పుట్టిన‌రోజు.. శుభాకాంక్ష‌ల వెల్లువ‌

నేడు సోనియాగాంధీ పుట్టిన‌రోజు.. శుభాకాంక్ష‌ల వెల్లువ‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: నేడు కాంగ్రెస్‌ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ పుట్టినరోజు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె దృఢంగా పోరాడతారు. ధైర్యం, స్థితిస్థాపకత, త్యాగం, నిస్వార్థ అంకితభావంతో ప్రతి సవాలును ఎదుర్కొంటూ దయకు చిహ్నంగా నిలిచారు. ఆమె దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఖర్గే సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.

కాగా, సోనియాగాంధీకి ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె దీర్ఘాయుషుతో, మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మోడీ ఎక్స్‌్‌ పోస్టులో సోనియాకు బర్త్‌డే విషెస్‌ తెలిపారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె స్టాలిన్‌ సోనియాకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె జీవితం త్యాగానికి, నిస్వార్థమైన ప్రజా జీవితం, సెక్యులరిజం, రాజ్యాంగ విలువలను కాపాడాలనే స్థిరమైన సంకలాన్ని ప్రతిబింబిస్తుంది. ఆమె సూత్రప్రాయమైన మార్గం, మార్గదర్వకత్వంతో ప్రగతిశీల, సమ్మిళిత ‘ఇండియా ‘ కోసం మన సమిష్టి ప్రయత్నాలను కొనసాగిద్దాం’ అని స్టాలిన్‌ ఎక్స్‌ పోస్టులో సోనియా గురించి రాసుకొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -