నవతెలంగాణ–హైదరాబాద్: రాష్ట్రంలో 2020-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సవరంలో బుధవారం ఒక్కరోజే చేరేందకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెట్, ప్రయివేటు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకుల జూనియర్ కళాశాల్లో విద్యార్థులకు ప్రవేశాలను కల్పించాలని సూచించారు. అయితే ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల జూనియర్ కాలేజ్‌ల్లో చేరేందుకు ఎలాంటి జరిమానా విధించలేదని, ఉచితంగానే ప్రవేశాలను పొందొచ్చని కోరారు. ప్రయివేటు జూనియర్ కాలేజ్‌ల్లో ప్రవేశాలు పొందాలంటే రూ. వెయ్యి జరిమానా చెల్లించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రవేశాలు పొందిన విద్యార్థుల వివరాల్లో సవరణలకు అవకాశం కల్పించామని తెలిపారు.
ప్రయివేటు జూనియార్ కాలేజీల్లో ఒక్కో సవరణ కోసం రూ.250 చెల్లించాలని చెప్పారు. ప్రభుత్వ జూనియార్ కాలేజీల్లో ఎలాంటి రుసుం చెల్లించకుండానే సవరణన చేసుకోచ్చు అని వెల్లడించారు. ఈ అవకాశాన్ని మళ్లీ పొడగించబోమనీ, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్ని జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు విద్యార్థులకు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిపించాలని తెలిపారు. రాష్ట్రంలో అనుబంద గుర్తింపు ఉన్న జూనియర్ కాలేజీల్లోనే ప్రవేశం పొందాలని విద్యార్థులు, తల్లిదండ్రులను కోరారు. ఆ కాలేజీల జాబితాను acadtgbie.cgg.gov.in లేదా tgbie.telangana.gov.in వెబ్‌సైట్ లో పొందుపరిచామని వివరించారు.